Wednesday, January 22, 2025

మోడీ సర్కారుపై సచిన్ ఫైర్

- Advertisement -
- Advertisement -

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలకు దిగుతోంది. విపక్ష రహిత భారతదేశానికి తెరతీస్తోందని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ విమర్శించారు. ఒడిశాలో శనివారం ఆయన బాలాసోర్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి , కేంద్ర మాజీ మంత్రి శ్రీకాంత్ జెనాకు మద్దతుగా ప్రచారసభలో మాట్లాడారు. తనపై విమర్శలను ప్రధాని మోడీ సహించలేకపోతున్నారని, ఈ క్రమంలోనే వరుసగా విపక్ష నేతలను జైళ్లకు పంపిస్తున్నారని విమర్శించారు. దేశంలో నిత్యావసర సరుకుల ధరల తగ్గింపులో, ఇంధన, వంటగ్యాసు ధరల నియంత్రణలో మోడీ ప్రభుత్వం విఫలం అయిందని సచిన్ పేర్కొన్నారు. కేంద్రంలోని ప్రభుత్వాన్ని మార్చివేయాలని ప్రజలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని, అచ్చేదిన్ బాసలతో అధికారంలోకి వచ్చిన పార్టీ చతికిలపడిందని, ఇక ప్రజలు ఈ పార్టీని నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ప్రజలు కేంద్రంలోని పార్టీని మార్చివేయాలని చూస్తున్నారు. ఇక బిజెపి ప్రతిఫక్ష రహిత దేశాన్ని ఆశిస్తోందని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను కేంద్రం స్తంభింపచేశారని, ఇద్దరు సిఎంలను జైళ్లకు పంపించారని పైలట్ పేర్కొన్నారు. నిరంకుశ పోకడలతో ప్రధాన రాజ్యాంగ వ్యవస్థల ప్రతిష్ట అంతా గంగపాలయిందని తెలిపారు. న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం, మీడియాలను మరింతగా బలహీనపర్చేందుకు ప్రజాస్వామ్యం పెనుముప్పులో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల దశల సరళిని పరిశీలిస్తే పలు రాష్ట్రాలలో బిజెపి వెనుకబడిందని, ఉత్తరాదిలో చివరికి అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో కూడా బిజెపికి ఎదురుదెబ్బలు తప్పవని రాజస్థాన్‌కు చెందిన ఈ నేత విశ్లేషించారు. కేంద్రంలోని బిజెపి తీరు తెన్నులు దారుణంగా ఉండగా , ఇక్కడ ఒడిశాలో బిజెడి ప్రభుత్వం అసమర్థత, మితిమీరిన అవినీతితో సాగుతోందని సచిన్ పైలట్ తెలిపారు. ఏది ఏమైనా పేర్లకు తగ్గట్లుగా బిజెపి, బిజెడిలు ఒక్కటే అని, ఈ పార్టీలకు ఉమ్మడి ప్రయోజనాలు మిక్కుటం అని, ఈ విషయం గతంలో వీరి చర్యలు కదలికలతోనే తేలిపోయిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News