Sunday, April 6, 2025

అధిష్టానం హెచ్చరిక బేఖాతర్..పైలట్ దీక్ష షురూ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకత్వం హిచ్చరించినప్పటికీ రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మంగళవారం న్యూఢిల్లీ లోని అమరవీరుల స్మారకం వద్ద నిరశన దీక్ష చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సారథ్యంలోని రాజస్థాన్‌లోని గత బిజెపి ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై రాజస్థాన్ ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సచిన్ పైలట్ నిరశన దీక్ష చేపట్టారు. షహీద్ స్మారక్ వద్దకు చేరుకున్న సచిన్ పైలట్ దివంగత సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఒకరోజు రిలేదీక్షలో కూర్చున్నారు.

కాగా..నిరాహార దీక్ష చేపతున్నట్లు సచిన్ పైలట్ ప్రకటించిన దరిమిలా ఇది పార్టీ వ్యతిరేక కార్యకలాపంగా పరిగణించాల్సి వస్తుందని, దీన్ని మానుకోవాలని కాంగ్రెస్ నాయకత్వం సోమవారం రాత్రి ఒక ప్రకటనలో పైలట్‌ను హెచ్చరించింది. సొంత ప్రభుత్వంపై ఏదైనా సమస్య ఉంటే దాన్ని పార్టీ వేదికలపై చర్చించాలే తప్ప మీడియాకో, బహిరంగ వేదికలపైకో ఎక్కరాదని, ఇది పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకమైన చర్య అవుతుందని రాజస్థాన్ ఎఐసిసి ఇన్‌చార్జ్ సుఖ్‌జిందర్ సింగ్ రణధావా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News