Tuesday, April 8, 2025

‘ప్రపంచ పుస్తక దినోత్సవం’ సందర్భంగా తన తండ్రి సాహిత్యాన్ని చదివిన సచిన్

- Advertisement -
- Advertisement -

Sachin Tendulkar- World Book Day

ముంబయి: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన జీవితంలోని స్నిప్పెట్‌లను సోషల్ మీడియాలో పంచుకోవడం ,  అతని మిలియన్ల కొద్దీ అభిమానులను అలరించడంలో ప్రసిద్ధి చెందాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో తన తాజా పోస్ట్‌లో, ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా కవి మరియు నవలా రచయిత అయిన తన తండ్రి రమేష్ టెండూల్కర్ పుస్తకాన్ని చదువుతున్న ఫోటోలను పంచుకున్నాడు. నీలిరంగు టీ-షర్టు, డెనిమ్‌లు ధరించిన సచిన్ తోటలో కుర్చీలో కూర్చొని తన తండ్రి రాసిన సాహిత్యం పుస్తకాన్ని చదువుతూ కనిపించాడు.

అతడి పోస్ట్‌ గంట కన్నా తక్కువ సమయంలోనే వైరల్ అయింది.  71,000 లైక్‌లను అందుకుంది. ‘‘సాహిత్య’ పుస్తకాన్ని మా నాన్న శ్రీ రమేశ్ టెండూల్కర్ రాసారు.  మిస్ యూ బాబా!” అంటూ సచిన్ టెండూల్కర్ వరల్డ్ బుక్ డే అనే హ్యాష్‌ట్యాగ్‌తో పాటు పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News