Saturday, January 18, 2025

తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌటే… కానీ ఆ ఒక్క పరుగుతోనే

- Advertisement -
- Advertisement -

ముంబయి: సచిన్ టెండూల్కర్ పదహారు సంవత్సరాల వయుసులోని అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి ఎన్నో రికార్డులు సృష్టించాడు. తన బ్యాటింగ్ లో బౌలర్ల చుక్కలు చూపించడంతో ప్రత్యర్థి జట్టు బౌలర్లు నిద్రలేని రాత్రులు గడిపిన రోజులు కూడా ఉన్నాయి. షేన్ వార్న్ బౌలింగ్‌లో సిక్స్‌లు బాదడంతో ఒక రోజు రాత్రి తన నిద్ర పట్టలేదని చెప్పని రోజులు కూడా ఉన్నాయి. మా కాలనీలో చిన్నప్పుడు తన బ్యాటింగ్ చూసేందుకు తన స్నేహితులను తీసుకెళ్లాను. తాను ఆడిన తొలి మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగానని టీమిండియా బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ తెలిపాడు. సాహిత్య సహవాస్ కాలనీలో తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేతున్నప్పుడు తాను ప్రధాన బ్యాట్స్‌మెన్ గా బరిలో దిగాను. మొదటి మ్యాచ్‌లో డకౌట్ రూపంలో వెనుదిరగడంతో నిరాశకు గురయ్యారు. బంతి తక్కువ ఎత్తులో రావడంతో ఔటయ్యానని స్నేహితులకు వివరణ ఇచ్చానని చెప్పాడు. రెండో సారి దిగినప్పుడు కూడా డకౌట్‌గా కావడంతో మళ్లీ స్నేహితులకు బంతి ఎక్కువ ఎత్తులో వచ్చిందని షాకుగా చెప్పానని తెలిపాడు. మూడో మ్యాచ్‌లో మాత్రం స్నేహితులకు పిలవకుండా ఒక్కడినే మ్యాచ్ ఆడటానికి వెళ్లాను కానీ ఆ మ్యాచ్‌లో ఆరు బంతులు ఎదుర్కొని ఒక పరుగు చేసి రనౌటయ్యానని గుర్తు చేశారు. ఒక్క పరుగు చేసినందుకు శివాజీ పార్కు నుంచి బాంద్రాకు బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు సంతృప్తిగా అనిపించిందని స్పష్టం చేశారు. ఆ ఒక్క పరుగే తన ఆలోచన విధానాన్ని మార్చిందని సచిన్ వివరించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో వన్డేలు, టెస్టుల్లో కలిపి వంద సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు. వన్డేలు టెస్టుల్లో కలిసి మొత్త 34,347 పరుగుల చేసి రికార్డు నెలకొల్పాడు. ఆయన వంద సెంచరీల రికార్డు అందుకోవడం ఏవరికీ సాధ్యం కాదని క్రికెట్ పండితులు చెబుతున్నారు. తన క్రికెట్ జీవితంలో 200 టెస్టులలో 15,921 పరుగులు, 463 వన్డేలలో 18426 పరుగులు చేసి తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. వన్డేలలో ఫస్ట్ డబుల్ సెంచరీ చేసిన బ్యాట్స్ మెన్ గా రికార్డు సృష్టించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News