Friday, November 15, 2024

వ్యాపారి మన్‌సుఖ్‌హిరేన్ హత్యలో సచిన్‌వాజే ప్రధాన నిందితుడు

- Advertisement -
- Advertisement -

Sachin Vaje is main culprit in murder of Mansukh Hiren

 

ముంబయి పేలుడు పదార్థాల కేసు
ఎటిఎస్ దర్యాప్తు నివేదికలో వెల్లడి

ముంబయి: వ్యాపారవేత్త మన్‌సుఖ్‌హిరేన్ హత్యలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరున్న అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సచిన్‌వాజే ప్రధాన నిందితుడని మహారాష్ట్ర ఎటిఎస్ దర్యాప్తు నివేదికలో వెల్లడైంది. పేలుడు పదార్థాలతో కూడిన స్కార్పియో వాహనాన్ని రిలయన్స్ అధినేత ముకేశ్‌అంబానీ ఇంటి సమీపంలో ఫిబ్రవరి 25న గుర్తించారు. ఆ వాహనం హిరేన్‌దని గుర్తించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు జరుపుతున్న సమయంలో మార్చి 5న ఆయన అనుమానాస్పదస్థితిలో ఓ వాగులో శవమై కనిపించారు. హిరేన్ హత్యలో వాజే పాత్రపై తగినన్ని సాక్షాలు లభించాయని ఎటిఎస్ డిజి జైజీత్‌సింగ్ తెలిపారు.

మార్చి 4న రాత్రి 820కి హిరేన్‌ను ఇంటి నుంచి బయటకు రావాల్సిందిగా ఓ ఫోన్‌కాల్ వచ్చింది. కదులుతున్న కారులో హిరేన్‌ను చంపి వాగులో పడేసి ఉంటారని దర్యాప్తులో తేలింది. ఈ హత్య కోసం వినియోగించిన సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్టు ఎటిఎస్ డిజి తెలిపారు. వాజే సూచనలమేరకు ఈ సిమ్ కార్డులను గుజరాత్‌కు చెందిన నరేశ్‌గౌర్ పంపిణీ చేశారని డిజి తెలిపారు. సస్పెండైన పోలీస్ అధికారి వినాయక్ షిండే కూడా ఈ కేసులో నిందితుడని ఆయన తెలిపారు. వాజేకు సన్నిహితులైన వీరిద్దరినీ మార్చి 21న ఎటిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News