Thursday, January 23, 2025

బిజెపికి సదానంద గౌడ గుడ్‌బై సూచన

- Advertisement -
- Advertisement -

వెటరన్ బిజెపి నేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి డివి సదానంద గౌడ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ అభ్యర్థిగా మైసూరు లోక్‌సభ సీటుకు పోటీ చేయవచ్చు. 72 ఏళ్ల సదానంద గౌడ సోమవారం జన్మదినం జరుపుకున్నారు. ఆయన బిజెపి అభ్యర్థి వైసికె వాడియార్‌పై పోటీ చేయవచ్చు. కాంగ్రెస్ నేతలు ఆయనతో సంప్రదింపులు సాగిస్తున్నారు.ఆయన అభ్యర్థిత్వంపై ఒకటి రెండు రోజులలో ప్రకటన రావచ్చు. బెంగళూరు నార్త్ సిట్టింగ్ ఎంపి అయిన సదానంద గౌడ అదే స్థానానికి బిజెపి టిక్కెట్ రానందుకు అసంతృప్తి చెందారు. కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజె పేరును బెంగళూరు నార్త్‌కు బిజెపి ప్రకటించింది. ఆమె రెండు రోజుల క్రితం సదానంద గౌడను కలుసుకుని ఆశీస్సుల కోసం పాదాభివందనం చేశారు.

వొక్కళిగ కులానికి చెందిన గౌడ ఎన్‌డిఎ హయాంలో రైల్వేలు, న్యాయ, స్టాటిస్టిక్స్, కార్యక్రమ అమలు శాఖలు నిర్వహించారు. రైల్వే మంత్రిత్వశాఖ నుంచి తొలగించిన తరువాత గౌడ బాధ పడసాగారు.. పార్టీ చర్యలను విమర్శిస్తూ ఆయన ఇటీవల బాహాటంగా ప్రకటనలు చేయసాగారు కూడా. ఇక కాంగ్రెస్ మైసూరులో వొక్కళిగ అభ్యర్థి కోసం చూస్తున్నది. కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) అధ్యక్షుడు డికె శివకుమార్, ఇతర నేతలు గౌడతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టార్ కూడా పార్టీ టిక్కెట్ నిరాకరణ అనంతరం నిరుడు బిజెపి నుంచి రాజీనామా చేశారు. ఆయన అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేశారు కానీ ఓడిపోయారు. ఆయన ఇప్పుడు బిజెపిలో తిరిగి చేరారు. ఆయన బెలగావి నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేయవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News