Monday, January 20, 2025

పక్కా ప్రణాళికతో సదాశివ పేట అభివృద్ధ్ది

- Advertisement -
- Advertisement -

సదాశివపేట: పట్టణ ప్రగతితో పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందని కలెక్టర్ శరత్ అన్నారు. శుక్రవారం సదాశివపేటలోని ఎన్‌గార్డెన్‌లో మున్సిపల్ చైర్మన్ జయలక్ష్మి అధ్యక్షతన జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో ప్రజలతో కలిసి ర్యాలీ చేసి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమం ఒక అద్భుతమన్నారు.

పక్కా ప్రణాళికతో పట్టణాలను ప్రభుత్వం అన్ని రంగాల్లో తీర్చిదిద్దిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిస్ఠాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతితో పారిశుద్ధ సమస్య, కాలనీలకు మౌలిక వసతులు, రోడ్లు అండర్ డ్రైనేజీలు నిర్మాణంతో అభివృద్ధ్ది చెందిందన్నారు. పెరుగుతున్న జనజీవనంకు తగ్గట్టుగా సదాశివపేటను పూర్తి స్థాయిలో అభివృద్ధ్ది చేసేందుకు విశేషంగా కృషి చేయడం జరుగుతుందన్నారు.

సదాశివపేట మున్సిపల్ చైర్మన్ పిల్లోడి జయమ్మ మాట్లాడుతూ ఇంటింటికీ తాగునీరు అందించే బృహత్తరమైన కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలకు క్షేత్ర స్థాయిలో వైద్య సేవల కోసం బస్తా దవాఖానాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం మహిళ గ్రూపు సంఘాలకు చెక్కులను కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింత గోపాల్, కమిషనర్ కృష్ణారెడ్డి, కౌన్సిలర్‌లు పులిమామిడి రాజు, పిల్లోడి విశ్వనాథం, ఇంద్రమోహన్‌గౌడ్, రవి, శ్రీనివాస్, బిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు చీల మల్లన్న, నాయకులు చింత సాయినాథ్, మోబీన్, నసీరోద్దీన్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News