Sunday, December 22, 2024

బిఆర్‌ఎస్ పార్టీకి సదాశివనగర్ ఎంపిపి రాజీనామా

- Advertisement -
- Advertisement -

సదాశివనగర్ : సదాశివనగర్ మండల వైస్ ఎంపిపి గాదారి శ్రీనివాస్ రెడ్డి సోమవారం బిఆర్‌ఎస్ పార్టీకీ రాజీనామా చేసారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పార్టీలో తనకు సరైన గుర్తింపు లభించకపోగా మండల బిఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఎక్కువ కావడమే తన రాజీనామాకు కారణమని అన్నారు.

వైస్ ఎంపిపి పదవిలో కొనసాగుతున్న తాను కేవలం ఉత్సవ విగ్రహంలా ఉన్నానని చెప్పారు. గుర్తింపు లభించని చోటా ఉండటం ఇష్టం లేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. తనను ఎన్నుకున్న ప్రజలు కోరుకుంటే వైస్ ఎంపిపి పదవికి సైతం రాజీనామా చేస్తానన్నారు. స్థానిక ఎమ్మెల్యే తో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేసిన ఆయన మండల స్థాయి నాయకత్వంలో విభేదాలు ఎక్కువయ్యాయని చెప్పుకొచ్చారు. రాజీనామా అనంతరం ఏ పార్టీలో చేరుతాననేది ఇంకా ప్రకటించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News