మన తెలంగాణ/సిటీ బ్యూరో: సద్దుల బతుకమ్మ సంబురాలు అంబారాన్ని అంటాయి. సోమవారం నగర మం తా బతుకమ్మ ఆటపాటలతో హోరెత్తింది. ఆడపడుచులు బతుకమ్మ ఆటపాటలతో తమను తాము మైమరిచిపోయ్యారు. సంప్రదాయ దుస్తుల్లో ఆడపడుచులు వెలిగి పోయారు. బస్తీలు, కాలనీలు, గెటెడెట్ కమ్యూనిటీలు, అపార్టమెంట్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించారు. తిరొక్క పూళ్లతో పేర్చిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలంతా బతుకమ్మ చుట్టు చేరి ఆడి పా డారు. మరోవైపు బతుకమ్మ సంబరాలతో ట్యాంక్‌బండ్ మురిసిపోయింది. రాష్ట్ర సాంసృతిక శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అంతకు ముందు జిహెచ్‌ఎంసి, రాష్ట్ర సాంస్కతికశాఖ ఆధ్వర్యంలో ఎల్‌బి స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ బతుకమ్మ ఘాట్ వరకు బతుకమ్మలతో భారీర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా ఎల్‌బిస్టేడియంలో మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మే యర్ మోతే శ్రీలతలు గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బతుకమ్మ ఆటలు ఆడారు. అ నంతరం అక్క డి నుంచి ఆట పాటలు, వివిధ సాంస్కృతిక ధళాల ఆట పాటలతో ర్యాలీగా తరలి వెళ్లారు.
ఈ ర్యాలీలో జిహెచ్‌ఎంసికి చెందిన 3 వేల మంది పాల్గొన్నారు. మరోవైపు నగర నలుమూలాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలతో ట్యాంక్‌బండ్‌కు తరలి వచ్చారు. అక్కడ బతుకమ్మ ఆట, పాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతం పూర్తిగా జనసంద్రంగా మారింది. ట్యాంక్‌బండ్‌ను ప్రత్యేక విద్యుత్ దీపాలతో అలకరించడంతో వెలుగులను విరజిమ్ముతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రధాన వేదిక వద్ద జరిగిన బతుకమ్మ సంబురాలను వీక్షించేందుకు ట్యాంక్ బండ్‌పై పలు ప్రాంతాల్లో ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ప్ర భుత్వ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌పై జరిగిన బతుకమ్మ ఉత్సవాల్లో ఎమ్మెల్సీ కె.కవిత, పలువురు మంత్రులు, జి హెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మే యర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి, వివిధ శాఖల ఉన్నాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆట పాటల అనంతరం వెళ్లి రా గౌరమ్మ వెళ్లిరా అం టూ బతుకమ్మ ఘాట్‌లో నిమజ్జనం చేశారు.