Sunday, November 3, 2024

సద్గురుకు బ్రెయిన్ సర్జరీ

- Advertisement -
- Advertisement -

ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రాణాంతక ఆరోగ్య సమస్యను ఎదుర్కొన్నారని, ఆయనకు బ్రెయిన్ సర్జరీ జరిగిందని ఈషా ఫౌండేషన్ బుధవారం ప్రకటించింది. 66 సంవత్సరాల సద్గురు ప్రస్తుం కోలుకుంటున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న సద్గురును ఆసుపత్రిలో చేర్చించగా ఆయన మెదడులో అనేక చోట్ల రక్తనాళాలు చిట్టిపోయి ఉన్నాయని ఫౌండేషన్ తెలిపింది. పరిస్థితి క్షీణించడంతో మెదడులో రక్తస్రావాన్ని ఆపడానికి ఆయనకు వెంటనే అత్యవసరంగా బ్రెయిన్ సర్జరీని మార్చి 17న ఇండ్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో నిర్వహించినట్లు ఈషా తెలిపింది.

అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు సద్గురుకు ఎంఆర్‌ఐ జరిగిందని, మెదడులో రక్తస్రావాన్ని గుర్తించారని తెలిపింది. గడచిన 3, 4 వారాలుగా బ్రీడింగ్ జరిగినట్లు గుర్తించడంతోపాటు తాజాగా గడచిన 24 నుంచి 48 గంటల్లో మళ్లీ బీడింగ్ జరిగిందని తెలిపింది. ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ సద్గురు తన కార్యకలాపాలను కొనసాగిస్తూ వచ్చారని ఈషా తెలిపింది. బ్రెయిన్ పర్జరీ తర్వాత సద్గురు ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని సర్జరీ నిర్వహించిన డాక్టర్ వినీత్ సూరి తెలిపారు. ఆయన మెదడు, ఇతర అవయవాల పనితీరు సాధారణ స్థాయికి చేరుకుందని డాక్టర్ సూరి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News