Wednesday, December 25, 2024

సద్గురుకు బ్రెయిన్ సర్జరీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇషా ఫౌండేషన్ అధినేత, వ్యవస్థాపకుడు సద్గురు‌కు వాసుదేవ్‌కు ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో బ్రెయిన్ సర్జరీ జరిగింది. సద్గురు ఆరోగ్యంపై అప్‌డేట్‌లను పంచుకుంటూ, అపోలో హాస్పిటల్‌కు చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ వినిత్ సూరి ఇలా అన్నారు, “కొన్ని రోజుల క్రితం, మెదడులో ప్రాణాంతక రక్తస్రావం కారణంగా సద్గురు మెదడు శస్త్రచికిత్స చేయించుకున్నారు.

సద్గురు బాగా కోలుకుంటున్నారు. శస్త్రచికిత్స చేసిన వైద్యుల బృందం ఆయన పరిస్థితి అంచనాలకు మించి మెరుగుపడుతోందని చెప్పారు. కొన్ని రోజులుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న సద్గురుకు సీటీ స్కాన్ చేయగా బ్రెయిన్ ఉబ్బినట్టు డాక్టర్లు గుర్తుంచారు. సద్గురు దేశంలోని కోయంబత్తూరులో ఉన్న ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు. 1992లో స్థాపించబడిన ఫౌండేషన్, విద్యా, ఆధ్యాత్మిక కార్యకలాపాలను నిర్వహించే ఆశ్రమం. యోగా కేంద్రాన్ని నిర్వహిస్తోంది. సద్గురు 1982 నుండి యోగా నేర్పుతున్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News