Thursday, January 23, 2025

ఆసుపత్రిలో కోలుకుంటున్న సద్గురు…. వీడియో పోస్టు చేసిన ఆయన కుమార్తె

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మెదడులో రక్తస్రావం కారణంగా ప్రాణాపాయ స్థితికి చేరుకుని ఎమర్జెన్సీ బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ న్యూఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఆసుపత్రిలోని తన గదిలో బెడ్ మీద కూర్చుని వార్తా ప్రతిక చదువుతున్న జగ్గీ వాసుదేవ్ వీడియోను ఆయన కుమార్తె సోషల్ మీడియాలో సోమవారం షేర్ చేశారు. న్యూఢిల్లీలో వేగంగా కోలుకుంటున్న సద్గురు అంటూ ఆమె తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని ఆయన అభిమానులకు తెలియచేశారు. ఆ వీడియోలో సద్గురు తలపైన బ్యాండేజ్ ప్యాచ్ కనిపించింది. సద్గురు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతున్న ఆయన అభిమానులు, శిష్యులు పోస్టు చేసిన కొద్ది నిమిషాలకే దాదాపు 17 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. సద్గురు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు కూడా రాశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News