Thursday, December 26, 2024

నలుగురిని కని ఇద్దరిని దేశానికి అంకితం చేయండి

- Advertisement -
- Advertisement -

Sadhvi asks Hindu couples to produce 4 kids, dedicate 2 to nation

హిందూ సమాజానికి సాధ్వి రితంబర పిలుపు

కాన్పూర్/లక్నో: దేశంలోని ప్రతి హిందూ కుటుంబం నలుగురేసి చొప్పున పిల్లల్ని కని వారిలో ఇద్దరిని దేశానికి అంకితం చేయాలని హిందుత్వ నాయకురాలు సాధ్వి రితంబర పిలుపునిచ్చారు. త్వరలోనే భారత్ హిందూ దేశంగా మారనున్నట్లు ఆమె ప్రకటించారు. హనుమజ్జయంతి సందర్భంగా శనివారం ఢిల్లీలోని జహంగిర్‌పురిలో సంభవించిన మత ఘర్షణలను ఆమె ప్రస్తావిస్తూ హనుమాన్ జయంతి శోభాయాత్రపై దాడి చేసిన వారు దేశం సాధిస్తున్న అభివృద్ధిని చూసి అసూయ పడుతున్నారని అన్నారు. రాజకీయ ఉగ్రవాదం ద్వారా హిందూ సమాజాన్ని చీల్చడానికి ప్రయత్నిస్తున్న వారు నాశనం కాక తప్పదని ఆదివారం ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన నిరాలా నగర్‌లో రామ్ మహోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆమె హెచ్చరించారు.

ప్రతి హిందూ దంపతులు నలుగురు పిల్లల చొప్పున కనాలని, వీరిలో ఇద్దరిని కుటుంబానికి ఉంచుకుని మిగిలిన ఇద్దరిని దేశానికి అంకితం చేయాలని ఆమె కోరారు. దేశంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలని, దీని వల్ల జనాభా అసమతుల్యత ఉండదని సోమవారం లక్నోలో మీడియాతో మాట్లాడుతూ సాధ్వి అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రతి దంపతులు నలుగురు ప్లిలలను కని ఇద్దరు పిల్లలను ఆర్‌ఎస్‌ఎస్‌కు అంకితం చేయాలని మీరు కోరారా అని విలేకరులు ప్రశ్నించగా అవును ఇవ్వాలని కోరానని, వారిని విహెచ్‌పి కార్యకర్తలుగా తీర్చిదిద్దాలని ఆమె చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News