Thursday, January 23, 2025

ఈ సిరియా చిన్నారులకు ఎంత కష్టమొచ్చింది…(వీడియో)

- Advertisement -
- Advertisement -

డమాస్కస్: “అంకుల్….రోజూ మేము చలి, ఆకలితోనే పడుకుంటున్నాం, మా నాన్న చనిపోయినప్పటి నుంచి మా పరిస్థితి ఇలాగే కొనసాగుతోంది” అంటూ ఆ సిరియా చిన్నారులు తమ వ్యథలు తెలుపుతుంటే మనస్సున్న వారి మనస్సు ద్రవించక మానదు. వారి బాధలు, కష్టాలు చెప్పుకుంటుంటే వినడానికే ఎంతో బాధాకరంగా ఉంటోంది. ఆ ఇద్దరి చిన్నారుల పేరు సబా, ఇలాఫ్. వారు తమ వ్యథలు చెప్పుకొంటున్న వీడియోను డిసెంబర్ 7న (బుధవారం) ‘ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్’ తమ ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఈ టీమ్ ఉత్తర సిరియాలో పనిచేస్తోంది. ఆ టీమ్ తమ వీడియో క్లిప్‌తో పాటు 500 కుటుంబాల సాయం కోసం విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరింది.

ఏడేళ్ల సబా తమ గడ్డు పరిస్థితి చెప్పుకుంటుంటే మనస్సు కరగక మానదు. ఇంత చిన్న వయస్సులోనే వారికెన్ని కష్టాలు వచ్చాయి రా భగవంతుడా! అనిపిస్తుంది. తమ తండ్రి బతికి ఉన్నప్పుడు తాము సురక్షితంగా ఉండేవాళ్లమని, ఆయన పోయాక ఇప్పుడు చలి కాచుకోడానికి ఇంట్లో కట్టెలు కూడా లేవని…చలికి, ఆకలికి తాము ప్రతి రోజు బాధపడుతూ గడుపుతున్నామని చెబుతుంటే ‘అయ్యో’ అనిపిస్తుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News