Tuesday, November 5, 2024

అటవీ అందాలు చూడటానికి సఫారీ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

మన్ననూర్: నల్లమల అటవి ప్రాంతంలో అటవి అందాలను చూడడానికి ఏర్పాటు చేసిన సఫారీ వాహనాలు అక్టోబర్ 1వ తేది నుంచి ప్రారంభించడం జరుగుతుందని మన్ననూర్ ఫారెస్ట్ రేంజర్ అధికారి ఈశ్వర్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో ఫర్హాబాద్ గేట్ దగ్గర జంగిల్ సఫారీ ప్రారంభం కానుందని, ప్రతి వాహనంలో వాహనం నిర్ణీత మార్గంలో వెళ్తుందో లేదో తనిఖీ చేయడానికి జిపిఎస్ ట్రాకింగ్ పరికరం అమర్చబడుతుందన్నారు.

అలాగే ప్రతి వాహనానికి ఒక నేచర్ గైడ్ ఉంటారని, వారు నల్లమల అడవులలోని వృక్షజాలం, జంతుజాలం గురించి వివరిస్తారని, సఫారీ సమయాలు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందని తెలిపారు. సఫారీ రైడ్ వాహనంకు రూ. 2వేల రుసుము చెల్లించాల్సి ఉంటుందని, ఒక్కో వాహనంలో గరిష్టంగా 7 మందిని అనుమతిస్తారని, కావున అటవి అందాలు చూడటానికి వచ్చే టూరిస్టులు అటవిశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాహనాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News