Monday, December 23, 2024

ప్రతి ఇంటికీ అందుతున్న సురక్షిత మంచినీరు

- Advertisement -
- Advertisement -

నల్లగొండ : మిషన్ భగీరథ ద్వారా పల్లెలు, పట్టణాలు అనే తేడాలేకుండా ప్రతి ఇంటికీ అందుతున్న సురక్షిత మంచినీరు అని దేవరకొండ శాసన సభ్యులు, బిఆర్‌ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.ఆదివారం తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా తెలంగాణ మంచి నీళ్ల పండుగ సందర్భంగా పిఏపల్లి మండలం కోదండపురం వాటర్ ప్లాంట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

సమైక్య రాష్ట్రంలో తాగునీటి సమస్యతో దశాబ్దాల పాటు ఇబ్బందులు పడ్డ ప్రజలకు.. స్వరాష్ట్రంలో ‘మిషన్ భగీరథ’తో సీఎం కేసీఆర్ శాశ్వత పరిష్కారం చేశారని అని ఆయన అన్నారు.కృష్ణా, గోదావరి జలాలను శుద్ధిచేసి మిషన్ భగీరథ ద్వారా తెలంగాణలోని ప్రతి ఇంటికి అందిస్తున్నది ప్రభుత్వం అని ఆయన అన్నారు.దేశానికే ఆదర్శం సీఎం కేసీఆర్ మానసపుత్రిక మిషన్ భగీరథ పథకం అని ఆయన అన్నారు.మిషన్ భగీరథ పథకానికి కాలంతో సంబంధం లేదు. ఏ కాలమైనా తాగునీరు ఇంట్లోకి రావాల్సిందే. ఇదే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ ఏర్పాట్లు చేశారు అని ఆయన అన్నారు.

100 శాతం ఇళ్లకు రక్షిత మంచినీటిని సరఫరా చేస్తూ తెలంగాణ అరుదైన ఘనత సాధించింది అని ఆయన తెలిపారు. తాగడం, ఆహార తయారీ, వ్యక్తిగత పరిశుభ్రత వంటి అన్ని గృహ అవసరాలకు సురక్షితమైన నీరు అవసరం. ఈ క్రమంలోనే ప్రజల కోసం మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం అని ఆయన తెలిపారు.భవిష్యత్ తరాలకు నీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికలు రూపొందించారు అని ఆయన అన్నారు.

మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించి, పథకం విజయవంతంగా అమలు చేయడంతో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన, శుద్ధి చేసిన నీటిని పంపిణీ చేయాలన్న ముఖ్యమంత్రి కల నెరవేరిందని ఆయన అన్నారు.తెలంగాణలోని 23,839 గ్రామాల్లో దాదాపు 57.01 లక్షల ఇళ్లు, మున్సిపాలిటీల్లో విలీనమైన 649 గ్రామాలకు, 121 మున్సిపాలిటీలు, అడవులు, కొండలపై ఉన్న 136 గ్రామీణ ఆవాసాలకు మిషన్ భగీరథ నీరు అందుతోంది అని ఆయన అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీలు, ప్రభుత్వ సంస్థలకు కూడా కుళాయి కనెక్షన్లు ఇవ్వడం జరిగింది అని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్,ఎమ్మెల్సీ ఎంసి కోటి రెడ్డి,ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్నాయక్ ,మున్సిపల్ చైర్మన్లు,ఎంపీపీలు,జడ్పీటీసీలు,పిఎసిఎస్ చైర్మన్లు,పార్టీ నాయకులు, అధికారులు, సర్పంచులు,ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News