Sunday, December 22, 2024

ఆర్టిసి బస్సుల్లోనే సురక్షిత ప్రయాణం

- Advertisement -
  • సిద్దిపేట టూ సికింద్రాబాద్ ఏడు నూతన డీలక్స్ బస్సులు ప్రారంభం
  • ఆర్టిసి కార్మికుల జీతాల పెంపునకు సిఎం కెసిఆర్ కృషి
  • రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
    సిద్దిపేట అర్బన్ : ఆర్టిసి బస్సులోనే సురక్షితమైన ప్రయాణం కొనసాగుతుందని  రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోనిఇ ఆర్టిసి డిపో ఆధ్వర్యంలో సిద్దిపేట నుంచి సికింద్రాబాద్‌కు ఏడు నూతనడీలక్స్ సర్వీసులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టిసి సంస్థ్ధను కాపాడేందుకు కార్మికుల జీతాల పెంపునకు సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. 150 కోట్లు ఇస్తేనే ఆర్టిసి కార్మికుల జీతాలు ఇచ్చే పరిస్థితి నెలకొందని రూ. 1500 కోట్లతో ఆర్టిసి నడుస్తుందని అయినప్పటికి ఆర్టిసి కార్మికుల జీతాలు పెంచాలనీ సిఎం ఆదేశించినట్లు తెలిపారు. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ ప్రతి రోజు ఉదయం 4.30 గంటలకు ప్రారంభమై సికింద్రాబాద్, అలాగే సికింద్రాబాద్ నుంచి రాత్రి 10.30 గంటలకు ప్రారంభమై సిద్దిపేటకు ఈ డీలక్స్ బస్సు సర్వీసులు నడుస్తాయని తెలిపారు. సిద్దిపేట నుంచి 42 నాన్ స్టాప్ బస్సు సర్వీసులు ఉన్నాయని వాటిలో 40 గజ్వేల్, ప్రజ్ఞాపూర్ స్టాప్‌తో రవాణా సాగిస్తున్నామని తెలిపారు. నిత్యం సిద్దిపేట నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికులకు కరీంనగర్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బస్సుల బైపాస్ మీదుగా వెలుతున్నాయని అలాగే రాత్రి పూట జేబిఎస్ నుంచి సిద్దిపేటకు చేరేందుకు నేరుగా సిద్దిపేటకు బస్సు సర్వీసులు కావాలని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు అధునాతన సౌకర్యాలతో కూడిన పుష్ బ్యాక్ సిట్లతో కూడిన 7 నూతన డీలక్స్ సర్వీస్ బస్సులను ప్రారంభం చేసుకున్నామని తెలిపారు. ఆర్టిసి మనది కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఆర్టిసి బలోపేతానికి ప్రజలు సురక్షితమైన ప్రయాణంగా ఆర్టిసి బస్సు సర్వీసులలో ప్రయాణం చేయాలని ప్రయాణీకులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టిసి ఆర్‌ఎం సుదర్శన్, సిద్దిపేట ఆర్టిసి డిపో మేనేజర్ సుఖేందర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News