Monday, December 23, 2024

మహిళల భద్రత, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం : ఎంఎల్‌ఎ బిగాల

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ అర్బన్: రాష్ట్రంలో మహిళల సాధికారతకు సిఎం కెసిఆర్ అనేక పథకాలు తీసుకొచ్చి మహిళలు అభివృద్ధి చెందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని నిజామాబాద్ అర్బన్ ఎంఎల్‌ఎ బిగాల గణేష్ గుప్తా అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శ్రీరామగార్డెన్స్‌లో తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిగాల మాట్లాడుతూ స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో మహిళా సంక్షేమం, భద్రత కోసం అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారన్నారు. మహిళలకు ఇచ్చిన హామీ ప్రకారం ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పింఛన్లు ఇచ్చి వారిని ఆదుకుంటున్నారన్నారు.

మహిళలు ఆర్థికంగా వృద్ధి సాధించాలని మహిళలకు వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి వారు స్వయంగా ఉపాధి పొందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహిళలలో దాగివున్న ప్రతిభను వెలికితీసి సరికొత్త ఆవిష్కరణలు, పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి విహబ్ కేంద్రాలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. దేశంలో మొట్ట మొదటిసారిగా షీ టాక్సీ పథకం ద్వారా మహిళా ప్రయాణికుల భద్రత కల్పించడం కోసం, మహిళలు ఆర్థికంగా వృద్ధి సాధించడానికి మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణ అందించి సబ్బిడీలో వాహనాలు అందించిన ఏకైక ప్రభుత్వం బిఆర్‌ఎస్ ప్ర భుత్వమన్నారు. గర్భిణులు పౌష్టికాహారలోపంతో బాధపడకుండా ఆరోగ్యలక్ష్మి పథకం ప్రారంభించడం జరిగిందన్నారు. తద్వారా పిల్లలలో, తల్లులలో రక్త హీనత, పౌష్టికాహారం లోపం వాటిల్లకుండా మాతాశిశు మరణాలు తగ్గాయన్నాయని బిగాల పేర్కొన్నారు. అంగన్‌వాడీ సిబ్బంది శ్రమను గుర్తించిన సిఎం కెసిఆర్ వేతనాలు పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. బస్తీ దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో మహిళల కోసం మహిళా క్లినిక్ ఏర్పాటు చేసి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలతో పాటు ఇతర రోగ నిర్థ్ధారణ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నామన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరిగితే రూ. 12000తోపాటు కెసిఆర్‌కిట్ అందిస్తున్న గొప్ప ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వమన్నారు. సిం కెసిఆర్ తీసుకవచ్చిన వైద్య సదుపాయాలు, సంక్షేమ పథకాల వల్ల, వైద్య సిబ్బంది సహకారంతో, ఆరోగ్య కార్యకర్తల కృషి వల్ల దేశంలోనే అత్యధికంగా ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరుగుతున్నాయని ఇది ఎంతో శుభపరిణామన్నారు. బాలికలకు గురుకుల పాఠశాలల ద్వారా సంవత్సరానికి 1 లక్షల 20 వేలు రూ.ఖర్చు చేస్తూ నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేద ఆడపిల్లల పెళ్లిళ్లకు చేయూతనిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మీ , ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకురాలు ప్రతిమ రాజ్ రెడ్డి, సుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి , కార్పొరేటర్‌లు నిచెంగు లత, మాయవార్ సవిత, కంపల్లి ఉమారని, మరాఠీ యమున, బిఆర్‌ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు గంగమని, మెప్మా సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News