Thursday, January 23, 2025

సురక్షా దినోత్సవ వేడుకలు

- Advertisement -
- Advertisement -

నల్గొండ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో సురక్ష దినోత్సవం వేడుకలు జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం ఎస్పీ కార్యాలయం ముందు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ రాష్టం వచ్చాక ఎం వచ్చింది ఎం రాలేదు అనే వారి కోసం కాదు మన కోసం మనం ఈ కార్యక్రమం రూపకల్పన చేసుకున్నాం. ఆనాడు పోలీసులు ప్రజలు శత్రువులుగా ఉన్నారు. ఇవ్వాళ పోలీసులు ప్రజలు కలిసి ఉన్నారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ వచ్చింది తెలంగాణాలో పోలీసులు మన కొరకే ఉన్నారు అని తెలిపారు. ఎక్కడైతే మంచి శాంతియుత వాతావరణం ఉంటే అక్కడికి పరిశ్రమలు వస్తాయని అన్నారు.అప్పట్లో గొలుసు దొంగలు ఉండే వారు ఇపుడు రాత్రి పన్నెండు గంటలకు కిలో బంగారం వేసుకొని రోడ్డు మీద వెళ్లిన ముట్టుకునే వారు లేరు.తెలంగాణా రాకముందు ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్రమైన వేధింపులు ఉండేవి కానీ నేడు అలా లేదు అది అంతా షీ టీమ్ గొప్పతనం అన్నారు.

గతంలో ఊర్లలో పండగ కూడా జరుపుకునే పరిస్థితి లేదు. ఎం వచ్చింది తెలంగాణా వస్తే అంటే మాట్లాడే వాడికి మాట్లాడే అవకాశం వచ్చింది. పోలీస్ స్టేషన్లో అన్ని వసతులు కల్పన తెలంగాణా ప్రభుత్వం చేసింది.హరిత హారంలో పోలీసుల పాత్ర చాలు ఉంది. పలు అంశాలలో పోలీస్ లు చేసిన సేవలకు ప్రశంస పత్రాలు అందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి,ఎమ్మెల్సీలు బడుగుల లింగయ్య,కోటిరెడ్డి,జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి,ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి,గాదరి కిషోర్ కుమార్,చిరుమర్తి లింగయ్య,భాస్కర్ రావు,రవీంద్రా కుమార్,కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ మందాడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News