Monday, December 23, 2024

ఎన్టీపీసీలో భద్రతలకు అధిక ప్రాధాన్యత

- Advertisement -
- Advertisement -

జ్యోతినగర్: రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్ట్‌లో భద్రతలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ విద్యుత్ ఉత్పత్తిని జరపాలని ఎన్టీపీసీ ఈడి సునీల్ కుమార్ తెలిపారు. సోమవారం ఉదయం స్థానిక ఎంప్లాయీస్ డెవలప్‌మెంట్ ఆడిటోరియంలో ఉద్యోగులకు భద్రత, నిర్వహణ అంశంపై వర్క్‌షాప్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈడి సునీల్ కుమార్ మాట్లాడుతూ సురక్షితమైన పద్ధతిలో పనులునిర్వహించాలని ఉద్యోగులకు, అఈధికారులకు సూచించారు. రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్ట్‌లో భద్రతలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసు కుంటున్నామని తెలిపారు. పని స్థలాల్లో నిర్లక్షంగా ఉండకుండా భద్రతా చర్యలు పాటిస్తూ విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలనికోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News