Wednesday, January 22, 2025

ఖచ్చితంగా అన్ని భద్రతా విధానాలు పాటించాలి: దమ. రైల్వే జిఎం అరుణ్ కుమార్ జైన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రైలు కార్యకలాపాలనిర్వహణలో సిబ్బంది ఖచ్చిదంగా అన్ని భద్రతా విధానాలను పాటించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఆ శాఖ ఉద్యోగులకు సూచించారు. రైలు కార్యకలాపాల నిర్వహణలో పాల్గొనే సిబ్బందికి ఎటువంటి సత్వర మార్గాలను ఆనుసరించరాదని అన్ని భద్రతా అవసరాలు విధానాలను తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేశారు. దీనితోపాటు భద్రతతో కూడిన రవాణా అనే రైల్వే లక్ష్యాన్ని సాధించేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది సూపర్‌వైజర్ల మధ్య సరైన సమన్వయం అవగాహన చాలా అవసరమని అన్నారు.

మంగళవారం గుంతకల్‌లోని రైల్ క్లబ్‌లో గుంతకల్ డివిజన్ , డివిజనల్ రైల్వే మేనేజర్ కె. వెంకటరమణా రెడ్డి రైల్వే అధికారులు, శాఖాధికారులు, సూపర్‌వైజర్లు, సిబ్బందితో కలిసి నిర్వహించిన భద్రతా సదస్సులో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విధులు నిర్వర్తించే సమయంలో సిబ్బంది సానుకూల దృక్పథంతో ఉండాలని, ఎల్లప్పుడూ ఏకాగ్రతతో ఉండాలని అధికారులకు సూచించారు. పనుల గురించి లోతైన అవగాహన కలిగి ఉండాలన్నారు.

భద్రతా సదస్సులో డివిజనల్ అధికారులు దృశ్య మాద్యమo ద్వారా రైలు కార్యకలాపాల భద్రతను పెంపొందించడానికి శాఖల వారీగా చేపట్టిన చర్యలపై జనరల్ మేనేజర్ కి వివరణాత్మకoగా తెలియజేశారు. కాగా గుంతకల్ డివిజన్ ఆపరేటింగ్, సిగ్నల్ , టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్ మెకానికల్ వంటి వివిధ శాఖలూ భద్రత అంశాలపై దృష్టి సారించాయి. ఫ్రంట్‌లైన్ సిబ్బంది యొక్క ఆలోచనలు, ప్రశ్నలు సందేహాలను జనరల్ మేనేజర్, డివిజనల్ రైల్వే మేనేజర్ ఈ సందర్భంగా నివృతి చేసారు. ఈ భద్రతా సదస్సు అనంతరం డివిజనల్ రైల్వే మేనేజరు కార్యాలయంలో అరుణ్ కుమార్ జైన్ డివిజనల్ రైల్వే మేనేజర్ సెక్షన్ కంట్రోలర్లతో ఇంటరాక్టివ్ సమావేశాన్ని నిర్వహించారు. భద్రత పనులకు ఆధిక ప్రాధాన్యతనీఇస్తూ నిర్ణీత గడువులోపు నిర్వహణపనులను పూర్తిచేయాలని సిబ్బందికి సూచించారు. ఈ సమావేశంలో, జనరల్ మేనేజర్ లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లు, గార్డులు, ట్రాక్ మెయింటెయినర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News