Sunday, January 19, 2025

సేప్టీ మోక్ ఉంటే చాలు… కింద జారిపడరు….

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/యాదాద్రి: కుల వృత్తిలో కల్లు తీయడానికి తాటి చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు మృతి చెందుతున్న కల్లు గీత కార్మికుల రక్షణ కోసం ఇటీవల తయారు చేసిన సేప్టి మోక్ నమోనతో తాటి చెట్టు ఎక్కి పరిశీలన చేశారు. శనివారము రోజున కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట గుండ్లపల్లి పరిధిలో గీత కార్మిమకులకు నూతనంగా తయారు చేసిన సేప్టి మోక్‌ను గుండ్లపల్లి కృష్ణ గీతకార్మికుడు ధరించి తాటి చెట్టు ఎక్కి తన కాళ్ళను వదిలివేయడంతో అతను కిందపడకుండా సేప్టి మోక్ రక్షణ కలిపించి తాటి చెట్టుపై వేలడటం జరిగింది.

సేప్టి మోక్‌తో తాటి చెట్టు ఎక్కిన కార్మికుడు మాట్టాడుతూ ఈ పరికరం ద్వార గీత కార్మికునికి ఉపయోగం ఉంటుందని ప్రమాదవశాత్తు కాలు జారినప్పుడు కింద పడకుండా ఆపడంతో మృతి చెందకుండా కాపాడే ఆవకాశం ఉందని అన్నారు.పూర్తి స్థాయిలో పరిశీలన చేసి తాటి చెట్టు ఎక్కడానికి సేప్టి మోక్ ఉపయోగపడుతుందని అన్నారు. యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధ, కల్లుగీత కార్మిక సంఘం రాష్త్ర ఉపాధ్యక్షుడు బోలగాని జాయరాములు మాట్లాడుతూ తరతరాలుగా కుల వృత్తి సాగిస్తున్న గౌడ కుల స్తులు ఎంతో మంది తాటి చెట్టు ఎక్కి ప్రమాదంకు గురై మృతి చెందారని అటువంటి అనార్ధలు జరగకుండా కల్లు గీత కార్మికులకు ఈ నూతన పరికరం ఉపయోగపడుతుందని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం సేప్టి మోక్ అందియడానికి చేస్తున్న కృషికి మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు,టాడి కార్పోరేషన్ చైర్మన్ బుర్ర వెంకటేశంకు గీతకార్మికుల పక్షన ధన్యావాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మికుల నాయకులు,కార్మికులు ఎరుకల హెమేందర్,కోల వెంకటేష్,మచ్చ నరసింహ, గౌడ సంఘం అధ్యక్షుడు గందమల్ల ఉపేందర్,మనహోర్,శేఖర్ బాబు,అనంద్ కుమార్ పెద్దరాజాలు,హరిశంకర్,వెంకటేష్, హరిబాబు, శేఖర్,లిగం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News