Monday, December 23, 2024

ఉద్యోగుల భద్రతే టిఎన్‌జిఓల ముఖ్య ఆశయం

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ సిటీ: ఉద్యోగుల భద్రతే టిఎన్‌జిఓల ముఖ్య ఉద్దేశమని, అందుకు ప్రభుత్వ సహాయసహకారాలు అందిస్తుందని ఎంప్లాయీస్ జెఎసి జిల్లా ఛైర్మన్, టిఎన్‌జిఓ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ అన్నారు. శుక్రవారం టిఎన్‌జిఓల జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటుచేసిన 21 రోజుల ఉత్సవాలు అద్భుతంగా ఏర్పాటుచేసి, నిర్వహించడంలో ఎంతో కృషిచేసిన ప్రతి అధికారికి, ఉద్యోగులకు టిఎన్‌జిఓస్ పక్షాన హృదయపూర్వకంగా ఉద్యమాభివందనాలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో తొలి ఉద్యమం నుంచి మలి ఉద్యమంవరకు టిఎన్‌జిఓలు చేసిన ఫ్రీజోన్, పెన్‌డౌన్, సహాయ నిరాకరణ, మిలియన్ మార్చ్, 42 రోజుల సకలజనుల సమ్మె తదితర ఉద్యమాల్లో ఎంతో చురుగ్గా పాల్గొని తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకొనుటకు అత్యంత ప్రముఖ పాత్ర వహించిన టిఎన్‌జిఓలు, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రాష్ట అవతరణ దశాబ్ధి ఉత్సవాలు విజయవంతం చేసేందుకు కృషిచేసిన ఉద్యోగులందరికి శుభాభినందనలు తెలియచేస్తూ, తొలి, మలి ఉద్యమంలో అమరులైన విద్యార్థి, ఉద్యోగులందరికి టిఎన్‌జిఓ పక్షాన ఘన నివాళులర్పిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ప్రముఖమైందని సిఎం కెసిఆరర్ తెలిపినందున టిఎన్‌జిఓస్ పక్షాన కృతఙ్ఞతలు తెలపుతున్నామన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల కరువు భత్యం, ఇతర సమస్యల పరిష్కరించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో టిఎన్‌జిఓల జిల్లా కార్యదర్శి నేటికుంట శేఖర్, సహాధ్యక్షులు చిట్టి నారాయణరెడ్డి, మాజీ జిల్లా కార్యదర్శి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ సంఘం అమృత్‌కుమార్, సలహాదారు ఆకుల ప్రసాద్, కేంద్ర బాధ్యులు పోల శ్రీనివాస్, సతీష్‌కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరాజు, జాఫర్ హుసేన్, కాసాని శ్రీనివాస్, సత్యం, సంజీవయ్య, నటరాజ్‌గౌడ్, ఉమా కిరణ్, అర్బన్, రూరల్ యూనిట్ల అధ్యక్షులు సుమన్‌కుమార్ , దినేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News