Wednesday, January 22, 2025

రైళ్లు, స్టేషన్‌లలో భద్రతా ప్రమాణాలను పాటించాలి

- Advertisement -
- Advertisement -
రైల్వే కార్యకలాపాలు, భద్రతపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే జిఎం

హైదరాబాద్ :  దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ రైల్వే కార్యకలాపాల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై వివిధ శాఖలకు చెందిన అధికారులతో సమీక్షా సమావేశాన్ని సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో మొత్తం 6 డివిజన్లు సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నాందేడ్ డివిజన్లకు చెందిన డివిజనల్ రైల్వే మేనేజర్లు (డిఆర్‌ఎంలు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ రైళ్లు, స్టేషన్‌లలో భద్రతా ప్రమాణాలను పాటించాలని సూచించారు.

తగిన సంఖ్యలో అగ్నిమాపక పరికరాలతో సహా భద్రతా పరికరాలపై ప్రాథమిక దృష్టి పెట్టాలని ఆయన అధికారులతో పేర్కొన్నారు. క్షేత్రస్థాయి సిబ్బందికి తరుచుగా కౌన్సెలింగ్ ఇవ్వాలని, భద్రతకు సంబంధించిన అన్ని అంశాలపై అవగాహన కల్పించాలని జనరల్ మేనేజర్ పునరుద్ఘాటించారు. క్షేత్రస్థాయి కార్యాచరణను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులు, సూపర్‌వైజర్లను ఆదేశించడంతో పాటు ఏదైనా తేడాలుంటే హాజరై వెంటనే సరిదిద్దుకోవాలని జిఎం సూచించారు. ఎలక్ట్రికల్, మెకానికల్, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్స్, ఆపరేటింగ్, ఇంజినీరింగ్ వంటి వివిధ విభాగాలను కలుపుకొని ఈ నెలలో జోన్ చేపడుతున్న భద్రతా డ్రైవ్ గురించి ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీంతోపాటు జోన్‌లోని సరుకు రవాణా పనితీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సరుకు రవాణా వినియోగదారుల అవసరాలను తీర్చడంతో పాటు సంవత్సరానికి నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News