Monday, December 23, 2024

రూ.1200,00,00,000 భారీ పెట్టుబడి

- Advertisement -
- Advertisement -

ఏరో ఇంజిన్ ఎంఆర్‌ఓ ఏర్పాటుకు సఫ్రాన్ నిర్ణయం

వెయ్యి మందికి పైగా ఉపాధి ’ఏరోస్పేస్ వ్యాలీ ఆఫ్ ఇండియా’గా
మారనున్న హైదరాబాద్ హర్షం వ్యక్తం చేసిన మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణకు మరో మణిహారం దక్కనున్న ది. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాక పెట్టుబడుల వరద కొనసాగుతున్నది. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చింది. ఎయిర్‌క్రాఫ్ట్ ఇం జిన్లు, రాకెట్ ఇంజిన్లతో పాటు వివిధ ఏరోస్పేస్, డిఫెన్స్ సంబంధిత పరికరాలు, వా టి భాగాలను రూపకల్పన, అభివృద్ధి, త యారుచేసే ఫ్రెంచ్ బహుళజాతి సంస్థ స ఫ్రాన్ గ్రూప్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో తన ఎంఆర్‌ఓ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇది 150 మిలియన్ల డాలర్లు (దాదాపు రూ. 1,185 కోట్లు) ప్రారంభ పెట్టుబడితో ఇది హైదరాబాద్‌కు రానుంది. సఫ్రాన్ గ్రూప్ రాక ఏరోస్పేస్, రక్షణ కార్యకలాపాలకు కేంద్రం గా హైదరాబాద్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. భారతదేశంలో గ్లోబల్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారు ద్వారా ఏర్పా టు చేసే మొదటి ఇంజన్ ఎంఆర్‌ఓ అవుతుందన్నారు.

ఫ్రాన్స్ కు చెందిన సఫ్రాన్ సంస్థ పెట్టుబడులు పెట్టడానికి హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కెటిఆర్ సంతోషం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని కనబరుస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చిందన్నారు. సఫ్రాన్ గ్రూప్ తెలంగాణ రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ హైద్రాబాద్‌లో మెగా ఏరో ఇంజిన్ ఎంఆర్‌ఓ ఏర్పాటుకు సఫ్రాన్ నిర్ణయించిందన్నారు. హైద్రాబాద్‌లో సఫ్రాన్ ఏర్పాటు చేసే ఎంఆర్‌ఓ ప్రపంచంలోనే పెద్దది అని తెలిపారు. ప్రపంచ స్థాయి సంస్థ భారత్‌లో ఏర్పాటు చేసే మొదటి ఇంజిన్ ఎంఆర్‌ఓ అని వెల్లడించారు ఎంఆర్‌ఓ, ఇంజిన్ టెస్ట్ సెల్ పెట్టుబడి దాదాపు రూ. 1,200 కోట్లు అని తెలిపారు.

800 నుంచి 1000 మంది వరకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఏరోస్పేస్ వ్యాలీ ఆఫ్ ఇండి యాగా హైదరాబాద్ మారబోతుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేసిన మంత్రి కెటిఆర్ అందుకు సంబంధించిన ఫొటోలను తన ట్విట్టర్‌లో పొందుపర్చారు. పాటు విదేశీ వాణిజ్య విమానయాన సంస్థల విమానాల్లో వాడే లీప్-1ఏ, లీప్-1బీ ఇంజిన్ల నిర్వహణను హైదరాబాద్‌లోనే చేస్తారన్నారు. ప్రస్తుతం విదేశాల్లోనే ఈ సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. సఫ్రాన్ ఎంఆర్‌ఓ కేంద్రం ఏర్పాటుతో తెలంగాణలోని ఏవియేషన్ పరిశ్రమకు మరింత ఊతం లభిస్తుందని తెలిపారు. దిగ్గజ సంస్థ అయిన సఫ్రాన్ పెడుతున్న ఈ భారీ పెట్టుబడితో ఏరోస్పేస్ రంగంలో హైదరాబాద్‌కు తిరుగులేదన్న సంగతి మరోసారి రుజువైందని మంత్రి కెటిఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News