Friday, January 10, 2025

మధ్యప్రదేశ్‌లో మరో ఘోరం… ఓ వ్యక్తి బట్టలూడదీసి, పైపులతో కొట్టారు

- Advertisement -
- Advertisement -

భోపాల్ : బిజెపి పాలిత మధ్యప్రదేశ్‌లో మరో దారుణ సంఘటన జరిగింది. దొంగతనానికి పాల్పడ్డాడని ఓ వ్యక్తి బట్టలూడదీసి పైపులతో కొట్టిన ఘటన సంబంధిత వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని సాగర్ సిటీలో ఈ దారుణం చోటుచేసుకుంది. నగ్నంగా ఉన్న వ్యక్తిని గోడకు కూర్చోబెట్టి కొందరు వ్యక్తులు చితకబాదడం ఈ వీడియోలో పొందుపర్చినట్లు వెల్లడైంది. తోటి మనిషి అనే కనికరం లేకుండా ఈ వ్యక్తి చేతులపై పైపులతో కొట్టారు.దొంగగా పట్టుకుని , చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారు ఈ వ్యక్తికి చాలా సేపు తమదైన లాకప్ చిత్రహింసలు రుచిచూపించారు. ఓ వ్యక్తి ఈ బాధితుడిని మోచేయితో పదేపదే తోసివేయడం , గోడకు అదిమిపెట్టడం కన్పించింది.

Also Read: పార్టీలు మారడం బట్టలు మార్చినంత ఈజీ కాదు: ఈటల రాజేందర్

ఈ వ్యక్తిపై దౌర్జన్యకాండ మోతీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ధరమ్‌కాంటలో జరిగింది. వీడియో వివరాల ద్వారా దాడి జరిగిన ఘటన ఎక్కడనేది తెలిసింది. ఈ వీడియో అంశం తమ దృష్టికి వచ్చిందని , పూర్తి స్థాయిలో దీనిని నిర్థారించుకుంటామని , ఘటన ఎక్కడ జరిగింది? వీడియోలో దౌర్జన్యానికి పాల్పడ్డినట్లు తెలిపే వ్యక్తుల ఆచూకీ కనుగొంటామని అదనపు ఎస్‌పి విక్రమ్ సింగ్ కుషావా విలేకరులకు తెలిపారు. మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న దారుణాలు వీడియోలుగా వెలుగులోకి వస్తున్నాయి. సిద్ధి జిల్లాలో ఓ చోట గిరిజన కూలీపై మూత్ర విసర్జన జరిగింది. గ్వాలియర్‌లో నడుస్తున్న కారులో ఓ వ్యక్తిని కొందరు కొడుతూ చివరికి ఆయనతో తమ పాదాలను నాకించిన ఘటన చోటుచేసుకుంది. ఇప్పుడు ఈ వీడియో వెలువడింది. ఈ ఘటనలతో రాష్ట్రంలో జరుగుతున్నదేమిటనేది ప్రశ్నార్థకం అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News