Wednesday, January 22, 2025

కూకట్‌పల్లి హైదర్‌నగర్‌లో కుంగిన భూమి

- Advertisement -
- Advertisement -

కూకట్‌పల్లి : కూకట్‌పల్లి సర్కిల్ హైదర్‌నగర్ డివిజన్‌లోని గౌతంనగర్ (రచ్చబండ) సమీపంలో ప్రముఖ ప్రణీత్ కంస్ట్రక్షన్ సంస్ధ గత కొన్ని రోజులుగా కనీస భద్రతా చర్యలు పాటించకుండా సుమారు 50 అడుగుల లోతు సెల్లార్ గుంతలు తీయడంతో బుధవారం స్ధానిక అపార్ట్‌మెంట్ వాసుల రోడ్డు భూమి ఒక్క సారిగా కుంగిపోవడంతో అపార్ట్‌మెంట్ వాసులు భయభ్రాంతులకు గురైయ్యారు. గత ఏడు నెలలుగా కొనసాగుతున్న అక్రమ బ్లాస్టింగులతో స్ధానిక అపార్ట్‌మెంట్‌లో గోడలు కూలి పోతున్నాయన్నారు. మెజర్‌మెంట్స్ ప్రకారం నిర్మాణం చేపట్టాల్సిన కంస్ట్రక్షన్ సంస్ధ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ చేపడుతున్న నిర్మాణాలతో స్ధానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కనీస చర్యలు పాటించకుండా నిర్మాణాలు చేపడుతున్నా సంబంధిత అధికార విభాగం పట్టించుకోవడం లేదని స్ధానికులు వాపోయారు. అపార్ట్‌మెంట్ వాసులు నడవడానికి సైతం రోడ్డు కూడా లేకుండా నిర్మాణాలు జరుపుతున్నారని, ప్రమాదాలు జరగకముందే చర్యలు చేపట్టాల్సిన సంబంధిత అధికారులు, స్ధానిక ప్రజాపత్రినిధులు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసుల తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న అక్రమ సెల్లార్‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్ధానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News