Wednesday, January 22, 2025

హిమాయత్‌నగర్‌లో కుంగిన మ్యాన్‌హోల్‌

- Advertisement -
- Advertisement -

గన్‌ఫౌండ్రీ : హిమాయత్‌నగర్‌లో మినర్వా కాఫీ షాప్‌కు ఎదురుగా ఉన్న ప్రదాన రోడ్డు పై మ్యాన్‌హోల్ కుంగుబాటుకు గురైంది.సోమవారం మెయిన్ రోడ్ పై జరిగిన ఈసంఘటనతో వాహనదారాలు బెంబేలెత్తి పోయారు.ఈమధ్యకాలంలోనే స్ట్రీట్ నెం 5లో మట్టిలోడ్‌తో వెళ్తుతున్న మిని లారి మ్యాన్‌హోల్ కుంగుబాటుతో నడిరోడ్డులో పడిపోయింది.మరల ఇదే డివిజన్‌లో వై జంక్షన్ నుండి లిబర్టీ వైపు వెళ్ళే ప్రధాన రోడ్ పై మ్యాన్‌హోల్ పక్కన మరో హోల్ పడింది.

ఈ హోల్ వెళ్తున్న వాహనాలతో సెకన్ సెకన్‌కు తీవ్రరూపం దాలుస్తుండడంతో వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. నగరంలో వరసగా కుంగిపోతున్న మ్యాన్‌హోల్స్‌తో ఎప్పుడు ఏప్రమాదం జరుగుతుందోనని ప్రజలు అయోమమంలో పడిపోతున్నారు.ఈసమాచారాన్ని అందుకున్న మున్సిఫల్ ఏఈ డివ్య సంఘటన స్థలాన్ని సందర్శించి హోల్ చుట్టూ ప్రమాద హెచ్చరికను ఏర్పాటు చేశారు.ఈసమస్యను మంగళవారం మున్సిఫల్ సిబ్బందితో కలిసి పరిష్కరిస్తామని తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News