Thursday, December 26, 2024

సాహితీ ఇన్‌ఫ్రా స్కామ్.. రూ.1,119 కోట్లు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఫ్రీలాంచ్ పేరుతో పలువురు అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసిన సాహితీ ఇన్‌ఫ్రాపై దర్యాప్తు చేసేందుకు సిసిఎస్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో సాహితీపై 50 కేసులు నమోదు అయ్యాయి. ఫ్రీలాంచ్ పేరుతో సాహితీ ఇన్‌ఫ్రా కస్టమర్ల నుంచి రూ.11,199,393,871 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు సిసిఎస్ జాయింట్ సిపి ఎవి రంగనాథ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. తొమ్మిది ప్రాజెక్ట్‌ల పేరుతో బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. రియల్ ఎస్టేట్ పేరుతో 1,752మంది బాధితుల నుంచి రూ.530 కోట్లు వసూలు చేసినట్లు సాహితీ ఇన్‌ఫ్రాపై ఆరోపణలు ఉన్నాయి. 38 అంతస్తుల అపార్ట్‌మెంట్ నిర్మాణం పేరుతో చాలామంది వద్ద నుంచి డబ్బులు వసూలు చేసింది.

ప్రాజెక్ట్ మొదలు పెట్టకుండానే కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేశారని, మరో ప్రాజెక్ట్‌లో రూ.900 కోట్లు సాహితీ ఇన్‌ఫ్రా వసూలు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. సాహితీ ఇన్‌ఫ్రా ఎండి బోడపాటి లక్ష్మినారాయణ, డైరెక్టర్లు 22మంది కలిసి వసూలు చేసిన డబ్బులను సొంతానికి వాడుకున్నారని పోలీసులు తేల్చారు. భూములు కొనుగోలు చేయకున్నా ఫ్రీలాంచ్ పేరుతో సాహితీ ఇన్‌ఫ్రా వసూళ్లు చేసింది. వందల కోట్లు వసూలు చేసిన నిందితులు ఏళ్లు గడుస్తున్నా నిర్మాణాలు మొదలు పెట్టకపోవడంతో బాధితులు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు బాధితులు సంఘారెడ్డి, సైబరాబాద్, హైదరాబాద్ పోలీస్ కమిషరేట్‌లో ఫిర్యాదు చేశారు. హైకోర్టులో కొందరు బాధితులు పిల్ వేయడంతో సిసిఎస్‌కు పంపించారు. దీంతో సిసిఎస్ హైదరాబాద్ పోలీసులు సాహితీ ఇన్‌ఫ్రాపై దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బాధితుల ధర్నాతో…
తమ వద్ద వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితులు సాహితీ ఆఫీస్‌కు రావడంతో వారికి సంస్థ ఎండి లక్ష్మినారాయణ చెక్కులు ఇచ్చాడు. వాటిని బాధితులు బ్యాంక్‌లో డిపాజిట్ చేయడంతో బౌన్స్ అయ్యాయి. వెంటనే బాధితులు జూబ్లీహిల్స్‌లోని సాహితీ ఇన్‌ఫ్రా కార్యాలయానికి వచ్చి ధర్నా చేశారు. దీంతో సాహితీ భాగోతం బయటపడింది. బాధితులు అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. లక్ష్మినారాయణను అరెస్టు చేసి 406,420,12(బి),రెడ్‌విత్ 34ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

తొమ్మిది ప్రాజెక్టులు…
సాహితీ స్వాద్ ప్రాజెక్ట్ రూ.65కోట్లు, సిస్టాఅడోబ్ రూ.79కోట్లు, సాహితీ గ్రీన్ రూ.40కోట్లు సాహితీ సితార రూ.135కోట్లు, సాహితీ మెహ రూ.44కోట్లు, ఆనంద ఫర్చూన్ రూ.45కోట్లు, సాహితీ కృతి రూ. 16కోట్లు, సాహితీ సుదిక్ష రూ.22కోట్లు, రూబికాన్ సాహితీ రూ.7కోట్లు ప్రాజెక్ట్‌ల పేరుతో డబ్బులు వసూలు చేశారు. అమీన్‌పూర్‌లో…సంఘారెడ్డి జిల్లా, అమీన్‌పూర్‌లో హైరైజ్ అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నామని నిందితులు చెప్పారు. 32ఫ్లోర్లతో 10టవర్లతో సాహితీ శ్రావణి ఎలైట్ పేరుతో నిర్మిస్తున్నామని చెప్పారు.

సర్వేనంబర్ 343లోని 23 ఏకరాలను కొనుగోలు చేసినట్లు చెప్పారు. భూమి యజమానులకు రూ.104.9కోట్లు చెల్లించారు. 10 ఎకరాలను సాహితీ కంపెనీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయగా, 13 ఎకరాలను అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ పేరు చెప్పి 2019-2022 నిందితులు రూ.504కోట్లు వసూలు చేశారు. ఇక్కడ సేకరించిన డబ్బులను వేరే ప్రాజెక్టులకు బదిలీ చేశారు. మాదాపూర్, గుట్టలబేగంపేటలోని కార్తికేయ పనోరమ, సాహితీ కృతిబ్లోసం, మాదాపూర్, సాహితీ సుదీక్ష, మోకిలా, శంకర్‌పల్లి ప్రాజెక్ట్‌లకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News