Friday, November 22, 2024

‘సాహితీ’ ఎండి పరార్

- Advertisement -
- Advertisement -

న్యాయం చేస్తా.. మాదాపూర్‌లోని వి కన్వెన్షన్‌కు రావాలని బాధితులకు
లక్ష్మీనారాయణ ఆహ్వానం అక్కడికి వెళ్లిన వారికి కనిపించని ఎండి,
సంస్థ ప్రతినిధులు ఆగ్రహంతో సాహితీ కార్యాలయానికి చేరుకొని ధర్నా

కన్వెన్షన్‌లో కన్పించని
ఇన్‌ఫ్రా వెంచర్స్ ప్రతినిధులు

మన తెలంగాణ/సిటీబ్యూరో: బాధితులకు న్యా యం చేస్తానని మాట ఇచ్చిన సాహితీ ఇన్‌ఫ్రాస్టక్చ ర్ ఎండి లక్ష్మినారాయణ మరోసారి మోసం చే శాడు. సంగారెడ్డి జిల్లాలో ని అమీన్‌పూర్‌లోని వెం చర్‌లో ప్రీలాంచ్ పేరుతో పలువురు బాధితుల వద్ద నుంచి డబ్బులు తీసుకుని ఇళ్లు కట్టిస్తామని మో సం చేసిన విషయం తెలిసిం దే. దాదాపుగా 1, 500 మంది వద్ద నుంచి రూ.400 కోట్ల వరకు వ సూలు చేసిన సాహితీ ఇన్‌ఫ్రా వెంచర్స్ ఎండి లక్ష్మినారాయణ డబ్బులు కట్టి మూడేళ్లు అవుతున్నా ఇళ్లు కట్టివ్వ లేదు. దీంతో బాధితులు హైదరాబాద్ రోడ్డు నంబర్ 36లోని సంస్థ కార్యాలయానికి వచ్చి గత నెల 30వ తేదీన ఆందోళన చేశారు. సాహితీ శర్వాని ఎలైట్ పేరులో 23 ఎకరాల్లో ప్రా జెక్టును లాంచ్ చేశారు. ఇందులో 4,300 ప్లాట్లను విక్రయిస్తామని ప్రకటించారు. 2019, జూన్‌లో ప్రాజెక్ట్ ప్రీ లాంచ్ పేరుతో కార్యక్రమం ఏర్పాటు చేసి ప్లాట్లను విక్రయించింది. ఇందులో ప్లాట్లను కొనుగోలు చేసిన వారికి 2023, మార్చి వరకు ఇళ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. వెంచర్‌లో నిర్మించే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు రూ.25లక్షలు, ట్రిపుల్ బెడ్ రూం ఇళ్లకు రూ.35లక్షలు వసూలు చేశారు.

డబ్బులు కట్టి ఏళ్లు అవుతున్నా ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో గత నెల 30వ తేదీన బాధితులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే డబ్బులు కట్టిన వారికి న్యాయం చేస్తానని ఆగస్టు 6వ తేదీన మాదాపూర్‌లోని వీ కన్వెన్షన్‌కు సాయంత్రం 4.30 గంటలకు రావాలని ఆహ్వానం పంపారు. ఇది నిజమని భావించిన బాధితులు తమ వద్ద ఉన్న ఆధార్ కార్డులు, సేల్ డీడ్స్, ఇతర పత్రాలు తీసుకుని వచ్చారు. కాని మీటింగ్ సమయానికి రెండు గంటల ముందు సమావేశం రద్దు అయిందని మెసేజ్‌లు రావడంతో ఖంగుతిన్నారు. అయినా కూడా పెద్ద ఎత్తున మాదాపూర్ వీ కన్వెన్షన్‌కు వచ్చారు. కన్వెన్షన్ నిర్వాహకులు అసలు తమ హాల్‌ను ఎవరూ బుక్ చేయలేదని, ఇక్కడ ఎలాంటి సమావేశం నిర్వహించడం లేదని స్పష్టం చేయడంతో బాధితులు అవాక్కయ్యారు. మరోసారి తమను సాహితీ ఎండి లక్ష్మినారాయణ మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కన్పించకుండా పారిపోయాడని ఆరోపించారు. వెంటనే అక్కడి నుంచి సాహితీ కార్యాలయానికి వెళ్లి ధర్నా చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News