Sunday, December 22, 2024

వచ్చే నెల 15,16 తేదీల్లో సాహిత్య సభలు

- Advertisement -
- Advertisement -

Sahitya sabha on 15th and 16th of next month

కాళోజీ పురస్కారం- 2022కు ఎంపికైన ప్రముఖ కవి శ్రీరామోజు హరగోపాల్ ను సన్మానించిన ఎంఎల్‌సి కవిత

హైదరాబాద్: ప్రజాకవి కాళోజి చేసిన సాహిత్య సేవలను స్మరించుకునేందుకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అక్టోబర్ 15, 16 వ తేదీలలో సాహిత్య సభలు నిర్వహించనున్నామని ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ప్రకటించారు. కాళోజీ జయంతి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయనకు కవిత నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ధిక్కార తత్వానికి ప్రతీక కాళోజీ అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతిష్టాత్మక కాళోజీ పురస్కారం- 2022 కు ఎంపికైన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన ప్రముఖ కవి రామోజు హరగోపాల్ కు ఈ సందర్భంగా ఆత్మీయ సన్మానం నిర్వహించారు. హరగోపాల్‌కు కవిత ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్ మంత్రి శ్రీదేవి, టీఎస్ ఫుడ్స్ ఛైర్మన్ మేడె రాజీవ్ సాగర్, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News