Sunday, December 22, 2024

హైదరాబాద్‌లో సాహిత్యోత్సవ్ జష్న్-ఎ-ఆదాబ్ కల్చరల్ కార్వాన్ విరాసత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో కిక్కిరిసిన ఆడిటోరియంలో ప్రేక్షకుల ఆనందోత్సాహాల నడుమ జరిగిన సాహిత్యోత్సవ్ జష్న్-ఎ-అదాబ్ కల్చరల్ కార్వాన్ విరాసత్ అపూర్వ విజయం సాధించింది. హిందుస్థానీ కళ, సంస్కృతి, సాహిత్యాన్ని వేడుక చేసుకునే అతిపెద్ద సాంస్కృతిక కార్యక్రమాలలో ఒకటైన సాహిత్యోత్సవ్ జష్న్-ఎ-ఆదాబ్ కల్చరల్ కార్వాన్ విరాసత్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ (జిఓఐ), పర్యాటక మంత్రిత్వ శాఖ (జిఓఐ) సహకారంతో నిర్వహిస్తున్నారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ (MANUU) మద్దతుతో ఈ సాంస్కృతిక కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించబడింది.

పద్మశ్రీ ప్రొఫెసర్ అశోక్ చక్రధర్‌, MANUU వైస్-ఛాన్సలర్, ప్రొ. ఐనుల్ హసన్, ప్రఖ్యాత శాస్త్రవేత్త ప్రొఫెసర్ సెయెద్ ఇ. హస్నైన్, తెలంగాణ కస్టమ్స్, జీఎస్టీ ప్రధాన కమిషనర్, సందీప్ ప్రకాష్, ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్, ఆంధ్ర, తెలంగాణ మితాలి మధుమిత, జష్న్-ఎ-అదాబ్, అధ్యక్షుడు నవనీత్ సోనీ IRS, కవి, సాహిత్యోత్సవ్ జష్న్-ఎ-అదాబ్ వ్యవస్థాపకుడు కున్వర్ రంజీత్ సింగ్ తో సహా విశిష్ట అతిథులు హాజరు కాగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం లో డెక్కనీ ఉర్దూపై పర్షియన్ ప్రభావాన్ని అన్వేషిస్తూ ప్రొఫెసర్ ఐనుల్ హసన్, అజ్మ్ షాకిరీలతో ‘డెక్కనీ ఉర్దూ మే ఫార్సీ కే అస్రాత్’పై చర్చా కార్యక్రమం జరిగింది. మరో ప్యానెల్ చర్చ కార్యక్రమంలో కులీ కుతుబ్ షా, హైదరాబాద్, ఔర్ దక్కనీ అదాబ్ ఈ ప్రాంతంలోని గొప్ప కవిత్వ సంప్రదాయాన్ని ఎత్తిచూపారు.

దక్షిణ భారతదేశానికి చెందిన లతీఫుద్దీన్ లతీఫ్, వాహెద్ పాషా క్వాద్రీ, షాహెద్ అదీలీ, మీర్ బిద్రీ, చాచా పాల్మూరి, ఫరీద్ సహర్ మరియు హమీద్ సాలీ వంటి ప్రముఖ కవులు చేసిన దక్కనీ షేరీ మెహఫిల్ అద్భుతమైన విజయాన్ని సాధించింది.

డా.విద్యా షా ఆత్మీయ స్వరంలో దాద్రా, తుమ్రీ, గజల్‌తో కార్యక్రమం సంగీత మలుపు తిరిగడంతో ప్రజలు ఆనందోత్సాహాలతో ఊగిపోయారు. అత్యంత ప్రజాదరణ పొందిన వార్సీ బ్రదర్స్, శక్తివంతమైన ఖవ్వాలీ ప్రదర్శనతో సాయంత్రం ముగిసింది.యువ కవిత్వ ఔత్సాహికులు, ప్రతిభావంతు ఉర్దూ కవిత్వం యొక్క వేగవంతమైన ఆట ‘బైత్‌బాజీ’ లో పాల్గొన్నారు. డాక్టర్ మమతా జోషి తన అందమైన పాటల ద్వారా హృదయాన్ని కదిలించే సూఫీ కలామ్‌లకు వందనం సమర్పించారు.అహ్మద్ రషీద్ షేర్వానీ ఉర్దూలో శ్రీమద్ భగవద్గీత పఠనం మన గంగా-జమునీ తహజీబ్‌కు నిజమైన వందనంగా నిలిచింది. ‘నృత్య ధార’తో జాతీయ అవార్డు గ్రహీత కూచిపూడి నృత్యకారిణి యామినీరెడ్డి హిందుస్థానీ నాట్య వైభవాన్ని ప్రదర్శించారు.

ప్రముఖ నటీనటులు అమిల్ సియాల్, మను రిషి చద్దా, ఫైసల్ మాలిక్ లతో జరిగిన ‘సినిమా ఓటిటి, థియేటర్: సమాజిక్ సరోకర్ యా మనోరంజన్’ అనే ప్యానెల్ చర్చలో ప్రియమైన నటీనటులు చర్చను వినడానికి యువత ప్రత్యేకించి అధిక సంఖ్యలో వచ్చారు. మెహ్ఫిల్-ఎ-సుఖాన్: ముషైరా, కవి సమ్మేళనం జరిగింది. ఇక్కడ పద్మశ్రీ ప్రొఫెసర్ అశోక్ చక్రధర్, మదన్ మోహన్ డానిష్, తాహిర్ ఫరాజ్, మోయెన్ షాదాబ్ వంటి లెజండరి కవులతో పాటుగా సుదీర్ఘమైన ఇతర భారతీయ కవులు, షాయార్‌లు పాల్గొనటం తో వేడుక ఘనంగా ముగిసింది.

ఈ కార్యక్రమం గురించి కవి, సాహిత్యోత్సవ్ జష్న్-ఎ-అదాబ్ వ్యవస్థాపకుడు కున్వర్ రంజీత్ చౌహాన్ మాట్లాడుతూ, “సాహిత్యోత్సవ్ జష్న్-ఎ-అదాబ్ కల్చరల్ కార్వా’న్ విరాసత్ మన సాంస్కృతిక వారసత్వం, హిందుస్తానీ కళ యొక్క వైభవాన్ని వేడుక చేసుకోవటానికి నిర్వహించబడింది. ఈ రోజు మనం గడుపుతున్న అస్తవ్యస్తమైన జీవితాల్లో ఆత్మీయత మరియు శాంతిని నింపడంలో ఇవి ఎంత ఉపయోగకరంగా ఉన్నాయో భారతదేశంలో, ప్రపంచం దాటిన ఎక్కువ మంది ప్రజలు గ్రహించడం చాలా ముఖ్యం. ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని దేశంలోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్ళటానికి మేము తీవ్ర ప్రయత్నాలను చేస్తున్నాము.

సంస్కృతిని ఎంతో అందంగా పరిరక్షించడంలో పేరుగాంచిన హైదరాబాద్‌లో మా కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా సంతోషంగా వుంది. ఈ కళాకారుల ప్రతిభను వీక్షించమని మేము ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తున్నాము. భారతీయ యువతను మన హిందుస్థానీ కళ, సంస్కృతి, సాహిత్యం యొక్క చైతన్యంతో అనుసంధానించడం, అర్థవంతమైన కళకు చేరువ చేయటం మా లక్ష్యం. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ (జిఓఐ), పర్యాటక మంత్రిత్వ శాఖ – ఇన్‌క్రెడిబుల్ ఇండియా (జిఓఐ), అమూల్యమైన మద్దతుకు మేము కృతజ్ఞులం. ఈ కార్యక్రమాన్ని సాధ్యం చేయడంలో మద్దతు ఇచ్చినందుకు MANUUకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము” అని అన్నారు.

ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, బీహార్, గుజరాత్, జమ్మూ & కాశ్మీర్‌తో సహా అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో సాహిత్యోత్సవ్ జష్న్-ఎ-ఆదాబ్ కల్చరల్ కార్వా’న్ విరాసత్ 2024 నిర్వహించబడింది, మరిన్ని ప్రాంతాలకు విస్తరించడం కొనసాగుతుంది. ఈ సంఘటన హిందుస్థానీ కళ, సంస్కృతి, సాహిత్యం రూపంలో భద్రపరచబడిన మన దేశ వారసత్వం యొక్క సారాంశాన్ని ప్రతిబింబిస్తుంది.

హిందుస్థానీ కళ, సంస్కృతి, సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి అంకితమైన అతిపెద్ద వేదికలలో సాహిత్యోత్సవ్ జష్న్-ఎ-అదాబ్ ఒకటి, ఈ సంప్రదాయాల, ప్రామాణికమైన రూపాలను, నిజమైన స్ఫూర్తిని పరిరక్షించడానికి, పెంపొందించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News