హైదరాబాద్ : క్యాన్సర్ రోగులకు తనవంతు సాయంగా ఒక చిన్నారి తన పుట్టిన రోజు సందర్భంగా శిరోజాలను దానం చేసిపెద్దమనుసు చాటుకుంది. నగరానికి చెందిన పివిబిపి శర్మ, పిఎస్వీ శైలజల కూతురు సహృద 5వ తరగతి చదువుతోంది. తన జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం ఏదోఒక సేవా కార్యక్రమం నిర్వహస్తుంది. ఈ సంవత్సరం తన జన్మదినోత్సవం సందర్భంగా సహృద తన పొడవాని శిరోజాలను కాన్యన్సర్ రోగులకు దానం చేయాలని నిర్ణయించుంకుంది. వెంటనే తన శిరోజాలను నగరానికి చెందిన హెయిర్ డోనేషన్ సంస్థ ప్రతినిధి ఉదయ్‌కి నగరంలోని బెయోన్స్ హెయిర్ అండ్ బ్యూటీ స్టూడియోలో టీమ్ హెయిర్ స్టైలిష్ మహేష్ కోడెపాక సమక్షంలో అందచేసి తన సహృదయాన్ని చాటుకుంది. అనంతరం ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రుల సహాయంతో తన శిరోజాలను ఈ విధంగా క్యాన్సర్ రోగులకు ఇవ్వడం చాలా అనందంగా ఉందని చెప్పింది. అనంతరం చిన్నారి సహృదను అభినందిస్తూ సంస్థ ప్రతినిధి ఉదయ్ ఆమెకు సర్టిఫికెట్‌ను అందచేశారు.