Wednesday, January 22, 2025

వృద్ధురాలి కలలోకి బాబా..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ :  ఓ వైపు భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్ర రాజ్యాలతో పోటీ పడుతుండగా.. మరోవైపు మనదేశంలో మాత్రం ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. నిత్యం ఏదో మూల నరబలి, జంతు బలి, మంత్రాలు, తంత్రాలు, క్షుద్రపూజలకు సంబంధించిన వార్తలు వస్తూనే వున్నాయి. తాజాగా హైదరాబాద్ పాతబస్తీలో మూఢ నమ్మకాలు కలకలం రేపుతున్నాయి. పహాడీ షరీఫ్‌కు చెందిన ఓ వృద్ధురాలి కలలోకి ఒక బాబా వచ్చారట.

తమ వంశం దాదాపు 600 ఏళ్లుగా ఈ భూమిలోనే నిద్రిస్తోందని, ఇప్పుడు తిరిగి భూమిపైకి రావాలని అనుకుంటోందని చెప్పాడట. అలా రావాలంటే ఒక సమాధిని నిర్మిస్తే దాని ద్వారా బయటకు రావొచ్చని ఆ వృద్ధురాలికి చెప్పాడట. ఇది నిజమేనని నమ్మిన వృద్ధురాలు ఆమె కుటుంబం కలిసి ఇంట్లోనే సమాధిని నిర్మించి, పూజలు చేస్తున్నారు. ఇంట్లోంచి వింత వింత శబ్ధాలు వస్తూ వుండటంతో స్థానికులు వణికిపో తున్నారు. పోలీసులకు సమాచారం అందడంతో సమాధిని కూల్చేశారు . దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News