Tuesday, October 1, 2024

వారణాసిలో సాయిబాబా విగ్రహాల తొలగింపు

- Advertisement -
- Advertisement -

వారణాసి(యుపి):సనాతన రక్షక్ దళ్ అనే గ్రూపు చేపట్టిన ప్రచారాన్ని పురస్కరించుకుని మంగళవారం వారణాసిలోని అనేక ఆలయాల నుంచి షిర్డీ సాయిబాబా విగ్రహాల తొలగింపు జరిగింది. ఇక్కడి బడా గణేశ్ ఆలయంలోని సాయి బాబా విగ్రహాన్ని తొలగించిన ఈ గ్రూపు సాయి విగ్రహాన్ని ఆలయం వెలుపల ఉంచింది. సరైన అవగాహన లేకుండా సాయిబాబాను ఆరాధిస్తున్నారని, హిందూ పురాణాలలో సాయిబాబా ప్రస్తావన ఎక్కడా లేదని బడా గణేశ్ ఆలయ ప్రధాన అర్చకుడు రమ్మూ గురు అన్నారు. శ్రీ అన్నపూర్ణ ఆలయ ప్రధాన పూజారి శంకర్ పురీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కాశీ(వారణాసి)లో కేవలం శివుడిని మాత్రమే ఆరాధించాలని సనాతన రక్షక్ దళ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అజయ్ శర్మ స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలను గౌరవించి వారణాసిలోని 10 ఆలయాలలోని సాయిబాబా విగ్రహాలను తొలగించామని, ,రానున్న రోజులలో అగస్తకుండ, భూతేశ్వర్ ఆలయాల నుంచి కూడా సాయిబాబా విగ్రహాలను తొలగిస్తామని ఆయన చెప్పారు. కాగా..ఈ పరిణామాలపై నగరంలోని సిగ్రా ప్రాంతంలోని సంత్ రఘువర్ దాస్ నగర్ లోని సాయిబబా ఆలయ పూజారి కమర్ ఘోష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు సనాతనులమని చెప్పుకుంటున్న వారే ఆలయాలలో సాయిబాబా విగ్రహాలను ప్రతిష్టించారని, ఇప్పుడు వారే అక్కడ నుంచి విగ్రహాలను తొలగిస్తున్నారని ఆయన చెప్పారు. వేర్వేరు రూపాలలో ఉన్నప్పటికీ దేవుళ్లంతా ఒకటేనని, సనాతన రక్షక్ దళ్ చేస్తున్న చర్యలు మంచివి కావని, అవి భక్తుల మనోభావాలను దెబ్బతీసి సమాజంలో విద్వేషాలకు దారితీస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News