Saturday, March 29, 2025

కరాటే పోటీల్లో సాయి చైతన్య విద్యార్థుల ప్రభంజనం

- Advertisement -
- Advertisement -

మోత్కూర్: భువనగిరిలో ఫిబ్రవరి 16న నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో మోత్కూర్ సాయి చైతన్య విద్యార్థులు బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించి ప్రభంజనం సృష్టించారు. ఈ పోటీల్లో 15 మంది సాయి చైతన్య విద్యార్థులు పాల్గొనగా.. 7 బంగారు, 4 వెండి, 6 కాంస్య పతకాలు సాధించినట్లు పాఠశాల డైరెక్టర్ బి.రవీందర్ రెడ్డి మంగళవారం తెలిపారు.

కటా విభాగంలో జె.శివ కుమార్, ఈ.అఖిల్ తేజ్, జి.ఉపేందర్, ఎం.హర్షవర్ధన్, ఎన్.సాక్షిలు బంగారు పతకాలు, బి.అభినాష్, డి.కృష్ణ సాయి, ఆర్.యషశ్రీ రజత పతకాలు, జె.వెంకటేష్, బి.శాంతి, పి.ప్రదీప్, ఎం.మనుతేజ్, ఎస్. ధనుష్, ఏ.రాకేష్, డి. కృష్ణ, సాయిలు కాంస్య పతకాలు సాధించారని పేర్కొన్నారు.

స్పార్రింగ్ విభాగంలో ఎం.మనుతేజ్ గోల్డ్ మెడల్, డి.కృష్ణ సాయి, ఎం.హర్షవర్ధన్లు సిల్వర్ మెడల్ సాధించారని పేర్కొన్నారు. మెడల్స్ సాధించిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్‌తో పాటు కరాటే మాస్టర్ అన్నెపు వెంకట్‌లు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News