Monday, December 23, 2024

సాయి చంద్ మరణం రాష్ట్రానికి తీరనిలోటు

- Advertisement -
- Advertisement -
  • ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి

గజ్వేల్: గుండెపోటుతో ఆకాల మరణం చెందిన ఉద్యమ నేత,రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ గాయకుడు సాయిచంద్ అంత్యక్రియల్లో ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొని వారి పార్థివదేహానికి నివాళులు అర్పించారు. సాయిచందు అంతిమ యాత్రలో పాల్గొన్న ఛైర్మన్ పాడే మోశారు. సాయి చంద్ తెలంగాణ రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సాయి చంద్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, సాయిచందు స్వరం తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచింది అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో సాయిచంద్ ఉద్యమ స్ఫూర్తితో పని చేశారు. అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప కళాకారున్ని కోల్పోయిందని,మంచి భవిష్యత్తు ఉన్న సాయిచందు మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరనిలోటు అని అన్నారు. సాయిచంద్ చిన్న వయస్సులో గుండెపోటుతో మృతి చెందడం చాలా బాధాకరం అన్నారు. సాయి చంద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News