Friday, December 20, 2024

నా జీవితంలోనూ బ్రేకప్ జరిగింది.. అందుకే..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా తేజ్ పెళ్లి గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఓ ఇంటర్య్వూలో పెళ్లి గురించి తేజ్ మాట్లాడుతూ.. “ఎవరో అంటున్నారు కదా అని పెళ్లి ఇప్పుడే చేసుకోను. నాకు నచ్చినప్పుడే నాకు ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను ” అని అన్నారు. ఇక తన జీవితంలోనూ బ్రేకప్ జరిగిందని.. ఓ అమ్మాయిని ప్రేమించిన తర్వాత విడిపోయామని.. ఆ తర్వాత అమ్మాయిలు అంటేనే తనకు భయం వేస్తుందని.. బ్రేకప్ తర్వాత సైలెంట్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చారు.

ప్రతి మనిసికి ఓ లైఫ్ జ‌ర్నీ ఉంటుంది. అందులో ప‌డ‌టం, లేవ‌టం అనేది సాధార‌ణంగానే జ‌రుగుతుంటాయి. అలా సాయిధ‌ర‌మ్ తేజ్ లైఫ్ స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతున్న స‌మ‌యంలో దేవుడు యాక్సిడెంట్ రూపంలో చిన్న బ్రేక్ వేశాడు. అయితే త‌ను దాంట్లో నుంచి రిక‌వ‌ర్ అయ్యి చేస్తున్న మొద‌టి సినిమా ‘విరూపాక్ష‌’. ఇదిలా ఉంటే.. విరూపాక్ష సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. సంయుక్తమీనన్, సాయి ధరమ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News