Monday, December 23, 2024

విజిల్ వేయించే అద్భుతమైన మూమెంట్స్

- Advertisement -
- Advertisement -

పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సినిమా జూలై 28న విడుదల కానున్న నేపథ్యంలో ఈ చిత్రంలోని ప్రధాన తారలు నటించిన పవర్ ప్యాక్డ్ టీజర్‌ను గురువారం ఆవిష్కరించారు. విజిల్ వేయించే అద్భుతమైన మూమెంట్స్ టీజర్‌లో ఎన్నో ఉన్నాయి. ఇక ఈ సినిమాలో టైటిల్ పాత్రధారి ’బ్రో’గా పవన్ కళ్యాణ్ నటిస్తుండగా, మార్క్ అకా మార్కండేయులుగా సాయి ధరమ్ నటిస్తున్నారు. ఫాంటసీ, ఆధ్యాత్మికత అంశాలతో కూడిన ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది.

Also Read: బిజెపిలో అడుగడుగునా అన్యాయం: రఘనందన్‌రావు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News