Wednesday, January 8, 2025

పవన్ కళ్యాణ్‌కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన మేనల్లుడు

- Advertisement -
- Advertisement -

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. స్టార్ వార్స్ లెగో సెట్‌ను ఆయనకు కానుకగా అందించారు. ఈ సందర్భంగా పవన్ తో దిగిన ఫొటోను సోషల్‌ మీడియా వేదికగా తేజ్ అభిమానులతో పంచుకున్నారు.

‘‘నాకు స్టార్‌వార్స్‌ లెగోను పరిచయం చేసింది మామయ్యే. ఆయనలోని పిల్లాడికి దాన్ని గిఫ్ట్‌గా ఇచ్చే అవకాశం ఇప్పటికి దక్కింది’’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. కాగా, పవన్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో సాయి తేజ్ నిన్న తిరుమల శ్రీవారి మెట్లు ఎక్కి మొక్కు తీర్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News