Tuesday, April 1, 2025

దూషించాడు… తరువాత హగ్ ఇచ్చాడు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్ లో భాగంగా ముంబయి ఇండియన్స్ పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. గుజరాత్ తొలుత బ్యాటింగ్ చేసి ముంబయి ముందు 197 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ముంబయి 160 పరుగులు చేయడంతో ఓటమిని చవిచూసింది. గుజరాత్ బౌలర్ సాయి కిశోర్ 15 ఓవర్ వేశాడు. హార్థిక్ పాండ్యా బంతి కొట్టడానికి ప్రయత్నించాడు. డాట్ బాల్ గా మారడంతో పాండ్యా సహనం కోల్పోయి సాయి కిశోర్ ను దూషించాడు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాయి మాత్ర అలానే చూస్తూ ఉండిపోయాడు. వెంటనే అంపైర్లు కలుగజేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు. మ్యాచ్ ముగిసిన తరువాత సాయి కిశోర్ ను పాండ్యా హగ్ చేసుకొని గొడవకు పుల్ స్టాప్ పెట్టాడు. గుజరాత్ తరపున 2022,2023 సీజన్లలో పాండ్యా నాయకత్వంలో సాయి కిశోర్ ఆడాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News