Wednesday, January 22, 2025

గురుపౌర్ణమికి ముస్తాబైన సాయిమందిరం

- Advertisement -
- Advertisement -

నల్లగొండ : హాలియాలోని శ్రీ షిరిడి సాయిమందిరంలో సోమవారం నిర్వహించనున్న గురుపౌర్ణమి వేడుకలకు భక్తులకు ఎలా ంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ కమిటీ అధ్యక్షుడు తేలపోలు శేఖర్ తెలిపారు. గురుపౌర్ణమి సందర్భంగా ఆలయంలో తెల్లవారుజామున కాకడ హారతి, 108 కళశాలతో బాబాకి కలశాభిషేకం, ఉదయం పుష్పార్చన, సంస్థాన్ హాతి, ధునిపూజ, భజన కార్యక్రమం, మధ్యాహా హారతి, మధ్యాహ్నాం మహాఅన్నదాన కార్యక్రమం, సాయంత్రం సామూహిక విష్ణు సహాస్ర నామ స్తోత్ర పారాయణం, అధ్యాత్మికత ఉట్టిపడే విధంగా కళాకారుల విన్యాసాలతో హాలియా పురవీధుల్లో అంగరంగ వైభవంగా సాయినాధుని శోభయాత్ర, పల్లకి సేవ, రాత్రి బ్రాహ్మాన అశీర్వచనము, పవళింపు సేవ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయిమందిరాన్ని పూలమాలలు, లైటింగ్‌లతో ముస్తాబు చేశారు.  కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్ధప్రసాదాలను స్వీకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మిట్టపల్లి సుబ్బారావు, కార్యదర్శి బానోతు సక్రునాయక్, మిట్టపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News