తీరిక వేళల్లో హీరోయిన్లు సినిమాలు చూస్తారు, లేదంటే పుస్తకాలు చదువుతారు. వంటలు చేసే ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు. మరి ఖాళీ సమయాల్లో సాయిపల్లవి ఏం చేస్తుంది? ఫ్రీ టైమ్ దొరికితే ఈ ముద్దుగుమ్మ తేనెటీగలు పెంచుతుంది. అవును.. ఇది నిజమే. ఈమధ్య అపికల్చర్‌పై ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది సాయిపల్లవి. తేనెటీగలు పెంపకం, తేనె సేకరించడం లాంటి అంశాలపై అవగాహన పెంచుకుంటోంది.
అది తనకు చాలా ఉత్సాహాన్నిస్తోందని చెబుతోంది సాయిపల్లవి. తీరిక వేళల్లో ఇలా తేనెటీగల పెంపకంతో పాటు.. తన తోటలో జరిగే పనుల్ని పర్యవేక్షిస్తానని చెబుతోంది. ఆమె తోటలో ప్యాషన్ ఫ్రూట్స్ ఉన్నాయట. వాటిని కోసుకొని తినడం తనకు చాలా ఇష్టమని అంటోంది. ఖాళీ సమయాల్లో ఇలా ఎన్ని పనులు పెట్టుకున్నప్పటికీ, ఎందుకో వంటింట్లోకి మాత్రం వెళ్లాలని అనిపించదంటోంది సాయిపల్లవి. వీటితో పాటు ఫ్రీ టైమ్ దొరికితే నిద్రపోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందంట ఈ నేచురల్ బ్యూటీ.