Thursday, January 23, 2025

సాయిపల్లవి డ్యాన్స్ వైరల్.. చూడటానికి రెండు కళ్లు చాలవు

- Advertisement -
- Advertisement -

అద్భతమైన నటన డ్యాన్స్ తో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టిన హీరోయిన్ సాయిపల్లవి మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. సాయిపల్లవి అంటే ఫస్ట్ గుర్తకొచ్చేది.. ఆమె డ్యాన్స్. ఎంత కష్టమైన స్టెప్పులైనా చాలా సింపుల్ గా..అలవోకగా చేసేస్తుంది. తన బాడీని స్ప్రింగ్ లా అటు.. ఇటు తిప్పుతూ లాచా ఈజీగా డ్యాన్స్ చేస్తుంది. ఆమె డ్యాన్స్ కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా తన చెల్లి పెళ్లి వేడుకలో సాయిపల్లవి డ్యాన్స్ అదరగొట్టింది. తన చెల్లెలితో కలిసి చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆమె డ్యాన్స్ చూసిన వారందరూ ఫిదా అవుతున్నారు.

కాగా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్య సినిమా తండేల్ లో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇక, తమిళంలో శివకార్తికేయన్-డైరెక్టర్ మురగదాస్ కాంబినేష్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టుతోపాటు బాలీవుడ్ లో రూపొందుతున్న రామాయణం సినిమాలో సీత క్యారెక్టర్ చేస్తున్నారు. ఇందులో స్టార్ హీరో రన్ బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. దాంతోపాటు అమీర్ ఖాన్ కొడుకు డెబ్యూ మూవీలోనూ హీరోయిన్ గా సాయిపల్లవి నటిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News