Thursday, January 23, 2025

సాయి పల్లవి డ్యాన్స్ వీడియో వైరల్… ఊరమాస్ డ్యాన్స్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సాయి పల్లవి అనగానే ఫిదా సినిమా గుర్తుకు వస్తుంది. ఫిదా సినిమాలో తన నటనతో పాటు డ్యాన్సుతో అందరినీ ఆశ్చర్యపరిచింది. సాయి పల్లవి చిన్నప్పటి నుంచి మంచి డ్యాన్సర్, 2015లో మలయాళంలో ప్రేమమ్ సినిమాతో ఆమె ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. 2017లో ఫిదా సినిమాతో టాలీవుడ్‌లో ప్రవేశించారు. ఆమె సినిమా పాటలకు చేసి డ్యాన్స్‌లు ఇప్పటికే వైరలయ్యాయి. ఆమెతో డ్యాన్స్ చేయడం కష్టమని ఇప్పటికీ హీరోలు చెబుతుంటారు. తాజాగా సాయి పల్లవికి సంబంధించిన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాలేజీలో జరిగిన వేడుకలో షీలా కీ జవానీ సాంగ్‌కు తన స్నేహితులతో కలిసి ఆమె డ్యాన్స్ చేసింది. సాయి పల్లవి డ్యాన్స్ ఊర మాస్‌గా ఉందని ఆమె అభిమానులు మెచ్చుకుంటున్నారు. ఎంత కఠినమైన స్టెప్స్ కూడా అలవోకగా చేస్తుందని ప్రశంసించారు. ఆమె టాలెంట్‌ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని పొగుడుతున్నారు. ఆమె ప్రస్తుతం రామాయణం ప్రాజెక్టులో సీతగా నటిస్తున్నారు. రామాయణం ప్రాజెక్టుకు సాయి పల్లవి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టుతో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కేరీర్ పరంగా మరింత ఎదగడం ఖాయమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News