Monday, December 23, 2024

తండ్రీ కూతుళ్ల అనుబంధం చుట్టూ సాగే కథ

- Advertisement -
- Advertisement -

సాయి పల్లవి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న సినిమా గార్గి. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తెలుగులో రానా దగ్గుబాటి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సాయి పల్లవి మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

మనకు ఎదురయ్యే ఘటనలతో…
గార్గి మూవీ కథ బాగా నచ్చింది. తండ్రీ కూతుళ్ల అనుబంధం చుట్టూ సాగే కథ ఇది. న్యాయ వ్యవస్థపై పోరాటం కనిపిస్తుంది. నిత్యం మనకు ఎదురయ్యే ఘటనలే తెరపై కనిపిస్తాయి. అందుకే అందరూ కనెక్ట్ అవుతారనిపించింది. ఈ పాత్ర కోసం నేను ఏం చేయాలి? ఎంత చేయాలి? ఎంత వరకు చేయవచ్చు? అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సినిమా చేశాను.
తండ్రి కోసం న్యాయ పోరాటం…
నేను ఇది వరకు ఫిదా, లవ్ స్టోరి, విరాటపర్వం సినిమాల్లో తండ్రి, కూతుళ్ల కథలో నటించాను. కానీ గార్గీ సినిమాలో ఉండే భావోద్వేగం డిఫరెంట్‌గా ఉంటుంది. గత చిత్రాల్లో తండ్రితో కలిసి ఉండే క్యారెక్టర్ పోషించాను. యుముడితో పోరాటం చేసి సావిత్రి తన భర్త ప్రాణాలు దక్కించుకొన్నట్టు.. ఈ సినిమాలో నాకు దూరమైన నా తండ్రి కోసం నేను న్యాయపోరాటం చేస్తాను.
హ్యాపీగా ఫీలయ్యా…
ఈ సినిమాలో నేను టీచర్ పాత్రను పోషించాను. టీచర్ ఎలా ఉంటుందనే కాకుండా కుటుంబంలో ఉండే సమస్య గురించి కథ ఎక్కువగా సాగుతుంది. ఇక గార్గి సినిమా కథ ముందుగా హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ వద్దకు వెళ్లింది. కథ గురించిన తెలిసిన తర్వాత తన సోదరుడు, దర్శకుడు గౌతమ్‌తో కలిసి ఐశ్వర్య లక్ష్మీ నిర్మించింది. ఒక హీరోయిన్ అయి ఉండి.. నా కోసం ఈ సినిమాను నాకు ఇవ్వడం చాలా హ్యాపీగా ఫీలయ్యాను.
సినిమాలో భాగమయ్యారు…
ఇటీవల ఈ సినిమాను సూర్య చూశారు. సూర్య ఈ సినిమా చూడగానే మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత ఆ మూడ్ నుంచి బయటకు వచ్చి.. ఈ సినిమాను నేను రిలీజ్ చేస్తానని చెప్పారు. ఆ తర్వాత జ్యోతిక వచ్చి నేను కూడా ఈ సినిమాలో భాగమవుతానని అన్నారు. ఇక తెలుగులో ఈ సినిమాకు రానా సమర్పకులుగా ఉన్నారు. ఈ సినిమాను కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం.

Sai Pallavi interview about ‘Gargi’ Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News