Tuesday, November 5, 2024

నా వ్యాఖ్యలను వక్రీకరించారు: సినీనటి సాయిపల్లవి

- Advertisement -
- Advertisement -

Sai Pallavi

హైదరాబాద్‌:  గో సంరక్షకులను, కశ్మీర్‌ పండిట్లను ఊచకోత కోసిన ఉగ్రవాదులను ఒకే గాటిన కట్టారంటూ తనపై వస్తున్న విమర్శలపై సినీనటి సాయిపల్లవి స్పందించారు. శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఓ వీడియో సందేశాన్ని పెట్టారు. తన మాటల్లో అసలు ఉద్దేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా వక్రీకరణలు చేసి కొంతమంది తనను దోషిగా చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన మాటల వల్ల ఎవరైనా బాధపడివుంటే క్షమించాలని కోరారు.

‘గత కొన్నిరోజులుగా నా వ్యాఖ్యలను వక్రీకరిస్తూ జరుగుతున్న ప్రచారానికి సంబంధించి స్పష్టత ఇచ్చేందుకే మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు కూడా నా అభిప్రాయాన్ని చెప్పాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తోంది. మళ్లీ నా మాటలు వక్రీకరించవచ్చు. ఇంటర్వ్యూలో నన్ను ‘‘మీరు లెఫ్ట్‌ వింగ్‌కి మద్దతిస్తారా? రైట్‌ వింగ్‌కా?’’ అని అడిగారు. ఆమె ఇటీవల ‘విరాటపర్వం’లో నటినందుకే, కథాంశం, పాత్ర పరమైన కారణంగానే విలేకరులు ఆమెను ఆ ప్రశ్న అడిగారన్నది ఇక్కడ గమనార్హం.

నేను దేనికి మద్దతు ఇవ్వడం లేదు అని స్పష్టంగా చె ప్పాను. ఆ ఇంటర్వ్యూను ముక్కలు ముక్కలుగా చేసి వైరల్‌ చేశారు. మనం ముందు మంచి మనుషులుగా ఉండాలని చెప్పడమే నా ఉద్దేశం. ‘‘కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమా చూశాక చాలా బాధపడ్డాను. అదే విషయాన్ని చిత్ర దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రితో పంచుకున్నాను. అక్కడి ప్రజలు వలస వెళ్లడం చూసి చాలా డిస్ట్రబ్‌ అయ్యాను అని ఆయనతో చెప్పాను. అలాగే కొవిడ్‌ టైమ్‌లో ఒక గుంపు గో రక్షణ పేరుతో ఓ వ్యక్తిపైన దాడి  చేసిన ఘటన నన్ను కదిలించింది. నా దృష్టిలో హింస ఏ రూపంలో ఉన్నా తప్పే. ఏ మతం పేరుతో జరిగినా అది పాపమే. ఒక వైద్యురాలిగా ప్రాణం విలువ నాకు తెలుసు. ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికిలేదు. ప్రతి ఒక్కరి ప్రాణం విలువైనదే’’ అని అందులో పేర్కొన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News