Thursday, February 20, 2025

జాతీయ అవార్డు కోసం.. దాన్ని దాచిపెట్టా: సాయిపల్లవి

- Advertisement -
- Advertisement -

సాయిపల్లవి.. ఈ పేరుకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దక్షిణ భారతదేశం అంతటా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె అందం, హుందాతనంకి అభిమానులు ఫిదా అయిపోతుంటారు. గ్లామరస్ రోల్స్‌కి దూరంగా ఉంటూనే తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు సాయిపల్లవి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. అదేంటో కాదు.. ఆమె జాతీయ అవార్డు అందుకోవాలని ఆశపడుతున్నారట. అందుకోసం ఓ వస్తువును కూడా దాచి పెట్టిందట ఈ సుందరి. సాయిపల్లవి నటించిన ‘గార్గి’ చిత్రానికి జాతీయ అవార్డు వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, చివరకు నిరాశే ఎదురైంది.

ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి ఏం చెప్పిందంటే.. తనకి 21 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు వాళ్ల మామ్మ ఓ చీర ఇచ్చిందని.. అది తన పెళ్లిలో కట్టుకోమని చెప్పినట్లు సాయిపల్లవి పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత మూడు సంవత్సరాలకే తాను ఇండస్ట్రీకి వచ్చానని.. వచ్చిన తొలినాళ్లలో ఏదో ఒక ప్రతిష్టాత్మక అవార్డు అందుకుంటానని నమ్మకం ఉండేదని.. అప్పట్లో జాతీయ అవార్డు ఎంతో గొప్ప కాబట్టి అదే తనని వరిస్తుందని భావించినట్లు తెలిపారు. ఆ అవార్డు అందుకున్న రోజు తాను ఆ చీర కట్టుకుందామని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News