Sunday, December 22, 2024

‘బేబీ’ మేకర్స్ కొత్త సినిమా ప్రారంభం..

- Advertisement -
- Advertisement -

బేబి ఘన విజయంతో కల్ట్ బ్లాక్ బస్టర్ కాంబోగా పేరు తెచ్చుకున్నారు నిర్మాత ఎస్ కేఎన్, దర్శకుడు సాయి రాజేశ్. ఈ కల్ట్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌లో మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. యంగ్ హీరో సంతోష్ శోభన్, సోషల్ మీడియా ఫేమ్ అలేఖ్య హారిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో స్టార్ హీరో నాగ చైతన్య క్లాప్‌తో ఘనంగా ప్రారంభమైంది.

డైరెక్టర్ హరీశ్ శంకర్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ స్క్రిప్ట్ అందజేశారు. ఈ చిత్రానికి సుమన్ పాతూరి దర్శకత్వం వహిస్తున్నారు. డైరెక్టర్ చందూ మొండేటి కెమెరా స్విచ్ఛాన్ చేయగా.. ఫస్ట్ షాట్‌కు వశిష్ట మల్లిడి దర్శకత్వం వహించారు.

హీరో సుశాంత్, దర్శకులు హను రాఘవపూడి, రాహుల్ సాంకృత్యన్ మూవీ టీమ్‌కు బెస్ట్ విశెస్ తెలియజేశారు. ఈ సందర్భంగా హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. ‘సాయి రాజేశ్ ఫెంటాస్టిక్ రైటర్, డైరెక్టర్. బేబి అద్భుమైన లవ్ స్టోరి. ఒక హీరోగా నాపై ఎంతో నమ్మకం పెట్టుకున్న ఎస్ కేఎన్ కు థ్యాంక్స్ చెబుతున్నా’ అని అన్నారు.

Sai Rajesh-SKN's New Movie Pooja Ceremony

డైరెక్టర్ సాయి రాజేశ్ మాట్లాడుతూ.. ‘నేను, ఎస్‌కెఎన్ కలిసి ఆరు లవ్ స్టోరీస్ చేయాలని అనుకున్నాం. కలర్ ఫొటో, బేబి వచ్చాయి. ఇప్పుడు ఆనంద్ దేవరకొండతో ఓ సినిమా చేస్తున్నాం. ఈ మూవీతో కలిపి నాలుగు అయ్యాయి. మరో రెండు లవ్ స్టోరీస్ చేస్తాం. ఇవన్నీ ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయా, సీక్వెల్సా అనేది ఇప్పుడే చెప్పలేను. ఇది నా మనసుకు దగ్గరైన కథ’ అని తెలిపారు.

నిర్మాత ఎస్‌కెఎన్ మాట్లాడుతూ.. ‘సాయి రాజేశ్ అద్భుతమైన రైటర్. నా ఫ్రెండ్ సంతోష్ శోభన్ మంచి యాక్టర్. మనం ఈ సినిమా చేద్దామని ముందుకొచ్చాడు. ఇలా అందరికీ బాగా ఇష్టమైన సబ్జెక్ట్ ఇది’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సుమన్ పాతూరి, హీరోయిన్ అలేఖ్య హారిక, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News