ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు అద్భుతమైన ఫాంతో దూసుకుపోతుంది. ముఖ్యంగా ఆ జట్టులోని యువ ఆటగాడు సాయి సుదర్శన్ ఈ సీజన్‌లో రాణిస్తున్నాడు. ఆడిన ఎనిమిది మ్యాచుల్లో 417 పరుగలు చేశాడు. అయితే సోమవారం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ సాయి సుదర్శన్ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించే అవకాశం ఉంది.
2022లో ఐపిఎల్‌లో అడుగుపెట్టిన సుదర్శన్ ఇప్పటికే తన అద్భుతమైన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. ఐపిఎల్‌లో ఇప్పటివరకూ 33 మ్యాచులు ఆడిన అతను 1451 పరుగులు చేశాడు. రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో మరో 49 పరుగులు చేస్తే.. ప్రపంచవ్యాప్తంగా టీ-20ల్లో 40 కంటే తక్కువ ఇన్నింగ్స్‌లో 1500 పరుగల మైలురాయిని చేరుకుంటాడు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్, రుతురాజ్ గైక్వాడ్‌ల పేరిట సంయుక్తంగా ఉండేది. వీరిద్దరు 44 ఇన్నింగ్స్‌లో 1500 పరుగులు చేశారు.
దీంతో పాటు సాయి సుదర్శన్ ఈ మ్యాచ్‌లో మరో రికార్డును కూడా సాధించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో అతను 71 పరుగులు చేస్తే.. 50 కంటే తక్కువ ఇన్నింగ్స్‌లో 2వేల పరుగుల చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. ఈ రికార్డు ప్రస్తుతం ఆసీస్ ఆటగాడు షాన్ మార్ష్ పేరిట ఉంది. అతను 53 ఇన్నింగ్స్‌లో 2వేల పరుగులు చేశాడు.